Wife Killed Husband: పొరిగింటి యువకుడితో ఎఫైర్.. యూట్యూబ్‌లో చూసి భర్తను చంపించిన మహిళ

గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. పొరుగింటి రవీందర్‌తో సన్నిహితంగా ఉన్న వీడియో కూతురు చూసి తండ్రికి చెప్పింది. దీంతో భర్తను హత్య చేసేందుకు యూట్యూబ్ చూసి, ప్రియుడి స్నేహితులతో హత్య చేయించింది.

New Update
Wife Killed Husband

Wife Killed Husband

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా భర్తలను ప్రియుడితో కలిసి హత్య చేసిన పలు దారుణ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. భర్త, కుటుంబం, పరువు, పిల్లలు, తల్లిదండ్రుల గురించి కొంచెం కూడా ఆలోచించకుండా కొందరు బరితెగిస్తున్నారు. గతంలో మహబూబాబాద్‌లో హెల్త్ సూపర్ వైజర్ పార్ధసారధిని అతని భార్య స్వప్న, ప్రియుడు సుపారీ ఇచ్చి హత్య చేయించారు. అలాగే అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ నేరాలకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా మరొక షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. 

Wife Killed Husband

గురుగ్రామ్‌లో తన భర్తను చంపేందుకు ఓ భార్య తన ప్రియుడుతో కలిసి కుట్ర పన్నింది. అనంతరం ఇంటర్నెట్‌లో యూట్యూబ్‌ వీడియోలు చూసి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. ఈ దారుణమైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు వివరాలు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

విక్రమ్, సోనీ దేవికి పెళ్లై మూడేళ్ల కూతురు ఉంది. అయితే సోనీ దేవి కొన్నాళ్లుగా పొరుగింటిలో ఉంటున్న రవీందర్‌తో పరిచయం పెంచుకుంది. అక్కడితో ఆగకుండా వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఒక రోజు సోనీదేవి, ఆమె ప్రియుడు రవీందర్ కలిసి సన్నిహితంగా ఉన్న ఒక వీడియోను ఆమె కూతురు చూసింది. ఈ విషయం ఆమె తన తండ్రి విక్రమ్‌కు చెప్పింది. విక్రమ్.. సోనీ దేవిని, రవీందర్‌ను మందలించడంతో వారి మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయి.

దీంతో సోనీదేవి ఎలాగైన తన భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తన ప్రియుడు రవీందర్‌తో కలిసి హత్యకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే హత్య ఎలా చేయాలి?, శరీరాన్ని ఎక్కడ పారవేయాలి అనే విషయాలను సోనీ, ఆమె ప్రియుడు ఇద్దరూ ఇంటర్నెట్, యూట్యూబ్‌లో చూశారు. అనంతరం పక్కా ప్లాన్ ప్రకారం.. జూలై 26వ తేదీన రాత్రి రవీందర్.. తన ప్రియురాలి భర్త విక్రమ్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ విక్రమ్‌ను హత్య చేశాడు. అనంతరం అతని శరీరాన్ని గుట్టుగా పాతిపెట్టడానికి రవీందర్ తన మామ సంత్రపాల్, మనీష్, ఫరియాద్ అనే ముగ్గురి సహాయం తీసుకున్నాడు.

ఆ తర్వాత విక్రమ్ కనిపించడం లేదంటూ భార్య సోనీ దేవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అదే క్రమంలో మరొక రోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సోనీదేవి.. పక్కింటి వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని.. వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెప్పింది.

దీంతో సోనీ దేవి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణలో భాగంగా.. మొదట రవీందర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అక్కడే అసలు విషయం బయటపడింది. విక్రమ్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతనిచ్చిన సమాచారం ఆధారంగా.. సోనీ దేవి(35), ఆమెతో పాటు రవీందర్‌(34), హత్యలో భాగమైన సంత్రపాల్(60), మనీష్(19), ఫరియాద్‌(20)లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు విచారణలో సోనీ దేవి, రవీందర్ తమ నేరాన్ని అంగీకరించారు. కూతురు తమ సంబంధాన్ని బయటపెట్టడంతో.. విక్రమ్‌ను ఎలాగైనా చంపాలని ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. 

Advertisment
తాజా కథనాలు