Maoist : చర్లలో మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాల కలకలం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సోమవారం మావోయిస్టు కరపత్రాలు, బ్యానర్లు కలకలం రేపాయి. మావోయిస్టు పార్టీ నేటి నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టులు కరపత్రాలు వేయడంతో పాటు బ్యానర్లు ఏర్పాటు చేశారు.