Student Missing: లండన్ లో నిజామాబాద్ విద్యార్థి మిస్సింగ్..స్నేహితులతో వెళ్లి...

లండన్‌ లో ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లిన తెలంగాణ విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత 4 రోజులుగా గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో విద్యార్థి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని వెతికి, స్వదేశానికి రప్పించాలని తల్లి ప్రభుత్వాన్ని కోరింది.

New Update
Nizamabad student missing

Nizamabad student missing

 Student Missing: లండన్‌ లో ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లిన తెలంగాణ విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత నాలుగు రోజులుగా గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో విద్యార్థి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి అనురాగ్‌ రెడ్డి లండన్‌లో మిస్‌ అయ్యాడు. ఆయన అదృశ్యం స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని ముప్కాల్ మండలం రెంజర్లకు చెందిన అనురాగ్ రెడ్డి ఏడాదిన్నర క్రితం ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు.

ఇది కూడా చూడండి:Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన

కాగా ఈ నెల 25వ తేదీన అదృశ్యం అయ్యాడు.అనురాగ్‌ రెడ్డి తన స్నేహితులతో కలిసి లండన్ లోని కార్దీప్ ప్రాంతానికి వెళ్లాడు. అయితే అక్కడ నుంచి అతను అదృశ్యమైయ్యాడు. ఈ విషయాన్ని వెంటనే అతని తల్లికి ఫోన్‌ చేసి చెప్పారు. కాగా ఈ విషయమై దీంతో తన కుమారుడిని వెతికి, స్వదేశానికి రప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.  కుమారుడు అదృశ్యం కావడంతో తల్లి హరిత, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

ఇది కూడా చూడండి:Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

తన కుమారుడిని వెతికి ఇండియాకు తీసుకురావాలని కోరుతూ అనురాగ్ రెడ్డి తల్లి హరిత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రికి సోమవారం వినతిపత్రం పంపించారు. ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ దీనిపై వెంటనే స్పందించారు. సీఎంఓ, జీఏడీ, ఎన్ఆర్ఐ అధికారులతో ఆయన మాట్లాడారు. దీంతో ఢిల్లీలోని విదేశాంగ శాఖకు, లండన్‌లోని ఇండియన్ హైకమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) లేఖ రాశారు. 

Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ

ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన

Advertisment
తాజా కథనాలు