/rtv/media/media_files/2025/04/28/J5plU9P9RLZ9et2PCb2F.jpg)
Waqf Board
వక్ఫ్ (సవరణ) చట్టం -2025 పార్లమెంటులో ఆమోదం పొందాక అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. విపక్షాలు ఈ బిల్లుకు అభ్యంతరం చెప్పినప్పటికీ ఈ బిల్లుకు ఆమోదం లభించింది. మరోవైపు ఈ వక్ఫ్ (సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముస్లిం సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు.
Also Read: స్వీడన్ నుంచి భారత్‌కు శక్తివంతమైన ఆయుధాలు.. ఇక పాక్ పని ఖతమే!!
ఈ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరగుతోంది. అయితే ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఏయే రాష్ట్రాల్లో వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో ప్రకటించింది. దేశంలో అత్యధికంగా వక్ఫ్ ఆస్తులు ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచిందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. యూపీ తర్వాత.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఉన్నాయని పేర్కొంది.
Also Read: ముఖ్యమంత్రి ఓవరాక్షన్.. స్టేజ్ మీదే IPS చెంపపై కొట్టబోయిన (VIRAL VIDEO)
దేశంలో వక్ఫ్ ఆస్తులకు సంబంధించి 8,72,352 స్థిరాస్తులు, 16,713 చరాస్తులు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటిదాకా 994 వక్ఫ్ ఆస్తులను ఇతర అవసరాలకు కేటాయించినట్లు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తంగా సున్నీల స్థిరాస్తులు 2,17,161, అలాగే షియాల స్థిరాస్తులు 15,386 ఉన్నట్లు చెప్పింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో 14,685 స్థిరాస్తులు, 85 చరాస్తులున్నట్లు పేర్కొంది. అలాగే తెలంగాణలో 45,682 స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపింది.
Also Read: రాబోయే ఐదేళ్లలో రోబోలే బెస్ట్ సర్జన్లు: ఎలాన్ మస్క్
waqf-amendment-bill | telugu-news | rtv-news | national-news