Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన

రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది. రష్యాలో విక్టరీ డే నేపథ్యంలో.. మే 8 నుంచి 10వ తేదీ వరకు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ పాటిస్తామని పేర్కొంది.

New Update
Russia declares 72-hour ceasefire in Ukraine next week

Russia declares 72-hour ceasefire in Ukraine next week

రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది. రష్యాలో విక్టరీ డే నేపథ్యంలో.. మే 8 నుంచి 10వ తేదీ వరకు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ పాటిస్తామని పేర్కొంది. మానవతా దృక్పథంతో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని ముగించాలని ట్రంప్‌ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా కాల్పుల విరమణ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.   

Also Read: స్వీడన్ నుంచి భారత్‌కు శక్తివంతమైన ఆయుధాలు.. ఇక పాక్ పని ఖతమే!!

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ జర్మనీపై రష్యా గెలిచింది. ఈ విజయానికి గుర్తుగా రష్యా ప్రతీ సంవత్సరం  మే 9న విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తోంది. శాంతి ఒప్పందానికి రష్యా, ఉక్రెయిన్‌లు ముందుకొచ్చాయని.. త్వరలోనే ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి మీటింగ్ జరిగే అవకాశం ఉందని ఇటీవల ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. 

Also Read: ముఖ్యమంత్రి ఓవరాక్షన్.. స్టేజ్‌ మీదే IPS చెంపపై కొట్టబోయిన (VIRAL VIDEO)

అయితే ఇటీవల వాటికన్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమైన తర్వాత పుతిన్‌పై విరుచుకుపడ్డారు. ఆయనకు అసలు యుద్ధం ఆపాలనే ఉద్దేశం ఉందని కనిపించడం లేదని పేర్కొన్నారు. అలాగే క్రిమియాకు సంబంధించి పలు సందర్భాల్లో రష్యాకు మద్దతుగా ట్రంప్ పలుమార్లు ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. అయికే క్రిమియాపై రష్యా అధికారాన్ని అంగీకరించమని ఉక్రెయిన్ తెలిపింది. 

Also Read: రాబోయే ఐదేళ్లలో రోబోలే బెస్ట్ సర్జన్లు: ఎలాన్‌ మస్క్‌

Also Read: స్టేజిపైనే ఆమెకు ప్రపోజ్ చేసిన డైరెక్టర్.. డైరెక్ట్ పెళ్లే అనడంతో కన్నీళ్లు పెట్టుకున్న యువతి (వీడియో)

ukraine | russia

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు