Nagarjuna Sagar: పోటెత్తిన వరద.. తెరుచుకోనున్న నాగార్జున సాగర్ గేట్లు
నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అధికారులు రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రానికి 576.10 అడుగులకు చేరింది.