KTR: నల్గొండ మంత్రుల అరాచకాలను ఎండగడతాం: కేటీఆర్ కీలక మీటింగ్ అధికార అహంకారంతో ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వారి అరాచకాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు. ఈ రోజు నల్గొండ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. By Nikhil 25 Sep 2024 in తెలంగాణ నల్గొండ New Update షేర్ చేయండి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మంత్రుల అరాచకాలను ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికార అహంకారంతో ఈ జిల్లా మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి అవినీతి ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నివాసంలో కేటీఆర్ ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ చేపట్టనున్న అంశాలు, కార్యక్రమాలను పార్టీ నేతలకు కేటీఆర్ వివరించారు. జిల్లాలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేశారు. మళ్లీ ప్లోరోసిస్ భూతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాలో మళ్లీ ఫ్లోరోసిస్ భూతం తెరపైకి వస్తోందని కేటీఆర్ కు జిల్లా పార్టీ నేతలు వివరించారు. అదే విధంగా కాంగ్రెస్ నేతల అరాచకాలు అవినీతి కి అడ్డు అదుపు లేకుండా పోయిందని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని అంశాల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తుండటంతో వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని కేటీఆర్ కు చెప్పారు. స్థానిక సమస్యలపై పోరాడుదాం. రాష్ట్ర రాజకీయాలతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించిన స్థానిక అంశాల పైన కూడా మరింత చురుగ్గా ప్రజాక్షేత్రంలో వెళ్దామని జిల్లా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. జిల్లాలో లేవనెత్తాల్సిన సమస్యలను వారికి వివరించారు. అదే విధంగా పార్టీని మరింత బలోపేతం చేయటంతో పాటు, కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించారు. త్వరలోనే నల్గొండ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తో పాటు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. #ktr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి