సూర్యాపేట జిల్లాలో సహకార సంఘం సమావేశంలో ఉద్రిక్తత

TG: సూర్యాపేట జిల్లాలో సహకార సంఘం సమావేశం రసాభాస నెలకొంది. తమకు రుణమాఫీ కాలేదని రైతు సమావేశాన్ని అడ్డుకున్నారు. తమకు రుణమాఫీ అయ్యేవరకు కదిలేది లేదని అక్కడే బైఠాయించారు. ఆఫీస్‌లోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

New Update
SURYAPET

Suryapet:

సూర్యాపేట జిల్లాలో సహకార సంఘం సమావేశం రసాభాస నెలకొంది. సీఈవో సస్పెన్షన్‌పై ఎర్రవరంలో సహకార సంఘ సమావేశం అయింది.అయితే .. ఈ సమావేశానికి ఛైర్మన్ శ్రీనివాసరావు హాజరుకాలేదు. సమావేశంలోకి రైతులు దూసుకొచ్చారు. సహకార సంఘ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. సమావేశ మందిరంలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. రుణమాఫీ రాకపోవడంపై 66  మంది రైతుల ఆందోళన చేపట్టారు. 

ఛైర్మన్, సీఈవో మధ్య సమన్వయ లోపంతోనే తమకు న్యాయం జరిగిందని రైతులు వాపోతున్నారు. ఇటీవల సీఈవోపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆయన ఉంటేనే తమకు న్యాయం జరుగుతుందని నినాదాలు చేశారు రైతులు. పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడి చేరుకొని రైతులకు అక్కడి నుంచిబ పంపించేందుకు ప్రయత్నాలు చేయగా.. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisment
తాజా కథనాలు