/rtv/media/media_files/LVX0rWmm7NnFh81VHfbR.png)
Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం పేర్కొంది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల మహాబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
కాగా సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ సూచించింది. నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, సూర్యాపేట, వరంగల్, రంగారెడ్డి, వికారాబాద్, జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది. ఈరోజు కూడా నారాయణపేట, గద్వాల్ జిల్లాలకు కూడా వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల దృష్యా ఎవరూ బయటకు రావొద్దని, అత్యవసర పరిస్థితుల్లోనే రావాలని పేర్కొంది.
Follow Us