Nalgonda: నల్గొండలో దారుణం.. ప్రియురాలిపై బావతో కలిసి..!

నల్గొండలో దారుణం చోటుచేసుకుంది. పుట్టలగడ్డ తండాకు చెందిన నాగు నాయక్ ప్రేమ పేరుతో యువతిని నమ్మించి గ్యాంగ్‌ రేప్‌ చేసి హత్య చేశాడు. యువతి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో హత్యకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Crime

Nalgonda Crime:  

ఓ దుర్మార్గుడు అమ్మాయిని ప్రేమ పేరుతో నమ్మించి గ్యాంగ్ రేప్ చేసి చంపి.. మళ్ళీ దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ దారుణానికి అతని తల్లి కూడా సహకరించడం మరింత సంచలనంగా మారింది. ఈ  అమానవీయ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. 

నల్గొండలో గ్యాంగ్ రేప్..!

వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పుట్టలగడ్డ తండాకు చెందిన యువతికి..  అదే తండాకు చెందిన అతని బావ నాగు నాయక్‌ తో  మైనర్ గా ఉన్నప్పటి నుంచే పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మరదల్ని ప్రేమించిన నాగు నాయక్ 18ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత ఆమెకు మాయమాటలు చెప్పి రెండు సార్లు గర్భవతిని చేసి.. అబార్షన్  చేయించాడు. మైనర్‌గా ఉన్నప్పుడే ఒకసారి గర్భవతిని చేసినట్లు తెలుస్తోంది. 

Also Read: విదేశీ గడ్డపై 'దేవర' దూకుడు.. విడుదలకు ముందే దమ్ములేపుతున్న జూనియర్!

హత్యకు స్కెచ్ 

ఆ తర్వాత మెల్లిగా ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ చేసిన నాగు నాయక్ ఫోన్ నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. దీంతో మనస్థాపం చెందిన యువతి ఈ నెల 14న  నాగునాయక్‌ ఇంటికి వెళ్లి ఆందోళనకు దిగింది. గతంలో కూడా ఓ సారి నాగు నాయక్ పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇక పెళ్లి చేసుకోమని యువతి ఎక్కువగా ఒత్తిడి చేయడంతో..  నాగు నాయక్, అతని తల్లి కలిసి ఆమెను చంపేందుకు స్కెచ్ వేశారు. ప్రేమతో మాట్లాడి ఆమెను నమ్మించి పొదల్లోకి తీసుకెళ్లి బావతో కలిసి గ్యాంగ్ రేప్ చేసి చంపాడు నాగు నాయక్. లోపలికి ఎవరూ రాకుండా అతని తల్లి కాపలాగా నిల్చొని నాగు నాయక్ దుర్మార్గానికి సహకరించింది. ఆ తర్వాత యువతికి ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. విషయం వెలుగులోకి రావడంతో నిందితుడు నాగు నాయక్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read:  Viral Fever: ఊరంతా జ్వరాలు.. అంతా ఆస్పత్రుల పాలు.. అసలు కారణమేంటి?

Advertisment
Advertisment
తాజా కథనాలు