Accident: చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి!

విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారి పై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి మియాపూర్ వైపు వెళుతున్న బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు.

New Update
miyapur

Accident: విజయవాడ (Vijayawada)- హైదరాబాద్‌ జాతీయ రహదారి పై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం జాతీయ రహదారి పక్కన కొయ్యల గూడెం వద్ద ఖమ్మం నుంచి మియాపూర్ వైపు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన నిలిచి ఉంది. 

ఈ క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ బలంగా వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే బస్సులోని ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా 11 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.

Also Read: భారత్‌లో ఉగ్రవాద కుట్ర.. కేంద్రం హైఅలెర్ట్!

Advertisment
తాజా కథనాలు