Non Tearable Paper : ఇక మీదట పుస్తకాల కవర్‌ చినిగిపోదు..ఎందుకంటే?

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటవతరగతి మొదలు ఇంటర్‌ మీడియట్‌ వరకు చదివే పిల్లలకు ఇచ్చే పాఠ్యపుస్తకాల కవర్‌ పేజీ ఇక మీదట చిరిగిపోదు. కారణం ఏంటంటే ఈసారి కవర్ పేజీలను నాన్‌ టియరబుల్‌ పేపర్‌తో తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

New Update
FotoJet - 2025-11-23T113558.579

Non Tearable Paper :  వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటవతరగతి మొదలు ఇంటర్‌ మీడియట్‌ వరకు చదివే పిల్లలకు ఇచ్చే పాఠ్యపుస్తకాల కవర్‌ పేజీ ఇక మీదట చిరిగిపోదు. కారణం ఏంటంటే ఈసారి కవర్ పేజీలను నాన్‌ టియరబుల్‌ పేపర్‌తో తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మీదట పాఠ్య పుస్తకాల ముఖచిత్రం ( కవర్‌ పేజీ) పేజీలను నాన్‌ టియరబుల్‌ పేపర్‌ను వాడాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇది  చూడడానికి అచ్చం ప్లాస్టిక్‌ మాదిరిగా ఉంటుంది. దీనితో చిరగడానికి అవకాశం చాలా తక్కువ. ఈ మేరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ముద్రించే ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగం, ఇంటర్‌ పాఠ్య పుస్తకాలను ముద్రించే తెలుగు అకాడమీకి సంబంధిత విభాగాల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇక మీదట నాణ్యమైన కాగితంతో ముద్రించిన పాఠ్య పుస్తకాలను ఇవ్వాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను2 నెలల క్రితమే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలోనే కవర్‌పేజీకి నాన్‌ టియరబుల్‌ పేపర్లను వాడాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. అంతేకాక1-10 తరగతుల పాఠ్య పుస్తకాల్లో మాదిరిగా ఈసారి ఇంటర్‌ పాఠ్యపుస్తకాల్లోనూ క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించాలని నిర్ణయించారు. వాటిని స్మార్ట్‌ ఫోన్ల ద్వారా స్కాన్‌ చేసి వీడియోలు, టెక్స్ట్‌రూపంలో అదనపు సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇక పాఠ్యపుస్తకాల ముద్రణకు తెలుగు అకాడమీకి 1500 టన్నుల కాగితం అవసరంకాగా.. ప్రస్తుతం 900 టన్నులు సిద్ధంగా ఉందని అధికారులు అంటున్నారు. మరో 600 టన్నులను రాష్ట్ర ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ ద్వారా సేకరిస్తారు. అయతే ప్రచురణకర్తలు మాత్రం కొత్త విధానాలు తెచ్చినప్పుడు టెండర్లు ముందుగా ఇవ్వాలి కదా అని అంటున్నారు. లేదంటే సరఫరా ఆలస్యమవుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


నాన్ టియరబుల్‌ పేపర్‌ అంటే ఏమిటీ?


నాన్ టియరబుల్‌ పేపర్‌ (NTR) అనేది చిరిగిపోని, మన్నికైన, నీటిని తట్టుకోగల కాగితం, ఇది సాధారణంగా సింథటిక్ మెటీరియల్స్‌తో తయారు చేయబడుతుంది. ఈ పేపర్‌ను సర్టిఫికేట్లు, ఫోటో ఆల్బమ్‌లు, లేబుల్‌లు, కార్డ్‌లు , ఇతర ప్రచార సామగ్రి వంటి వాటిని ముద్రించడానికి ఉపయోగిస్తారు, ఎందుకంటే ఇది ఎక్కువకాలం మన్నికను కలిగి ఉంటుంది. 

ముఖ్య లక్షణాలు,ఉపయోగాలు

మన్నిక: ఇది చిరిగిపోదు, తడిసి నాననివ్వదు,చాలా కఠినమైనది.

ఉపయోగాలు:

సర్టిఫికేట్లు మరియు మార్క్ షీట్లు: విద్యారంగంలో సర్టిఫికేట్లను ముద్రించడానికి దీన్ని ఎక్కువగా  ఉపయోగిస్తున్నారు
ఫోటోగ్రాఫిక్ ఉత్పత్తులు: ఫోటో ఆల్బమ్‌లు, ప్లే కార్డ్‌లు మరియు గిఫ్ట్ కార్డ్‌లు వంటివి ప్రింట్ చేయడానికి ఉపయోగిస్తారు.
లేబుల్స్: పారిశ్రామిక మరియు వినియోగదారుల ఉత్పత్తుల కోసం లేబుల్స్‌ను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
ఇతరాలు: క్యాలెండర్లు, మెనూ కార్డ్‌లు మరియు విజిటింగ్ కార్డ్‌ల వంటి వాటిని తయారు చేయడానికి కూడా దీనిని వాడతారు. 

ముద్రణ సేవలు: కొన్ని ప్రింటింగ్ సర్వీసులు మరియు సంస్థలు కూడా నాన్ టియరబుల్ ప్రింటింగ్ సేవలను అందిస్తాయి. 

సింథటిక్ పేపర్ కూడా..

నేటి డిజిటల్ టెక్నాలజీ యుగంలో, ముఖ్యమైన పత్రాలను ముద్రించడం నుండి ప్యాకేజింగ్,లేబులింగ్ వరకు మన జీవితంలోని వివిధ అంశాలలో కాగితం ఇప్పటికీ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అయితే, సాంప్రదాయ కాగితం తరచుగా మన్నిక, స్థితిస్థాపకత పరంగా వెనుకబడి ఉంటుంది. అదృష్టవశాత్తూ, సాంకేతికతలో పురోగతి ఒక అద్భుతమైన పరిష్కారానికి దారితీసింది: సింథటిక్ కాగితం . చిరిగిపోని కాగితంగా తయారు చేయబడిన సింథటిక్ కాగితం, దాని సాంప్రదాయ ప్రతిరూపానికి విప్లవాత్మక ప్రత్యామ్నాయంగా ఉద్భవించింది, పరిశ్రమలలో విస్తృత శ్రేణి అనువర్తనాలను అందిస్తోంది.  

సింథటిక్ పేపర్ ఉపయోగం

సింథటిక్ కాగితం అనేది ఒక ఆధునిక ఆవిష్కరణ, ఇది సాంప్రదాయ కాగితం యొక్క రూపాన్ని , అనుభూతిని ప్రతిబింబిస్తుంది, అదే సమయంలో అసాధారణమైన మన్నిక,బలాన్ని కలిగి ఉంటుంది. ఇది పాలిమర్ రెసిన్లు మరియు సంకలనాల కలయికను ఉపయోగించి సృష్టించబడుతుంది, దీని ఫలితంగా చిరిగిపోని, జలనిరోధక, రసాయనాలు,చమురు నిరోధక మరియు కఠినమైన పరిస్థితులను తట్టుకునే ఒక ప్రత్యేకమైన పదార్థం లభిస్తుంది. ఈ ఇంజనీరింగ్ కూర్పు చిరిగిపోని కాగితం తీవ్రమైన పరిస్థితులను తట్టుకునేలా చేస్తుంది, లేకపోతే సాంప్రదాయ కాగితం పనికిరానిదిగా మారుతుంది.

Advertisment
తాజా కథనాలు