Sankranti: సంక్రాంతికి ఊరెళ్లుతున్నారా? బస్సులు, రైల్లు ఫుల్‌ రిజర్వేషన్‌..టికెట్‌ ధర ఎంతో తెలుసా?

సంక్రాంతి అనగానే తెలుగువారికి చాలా ముఖ్యమైన పండుగ.అందులోనూ ఆంధ్రప్రదేశ్‌ వారికి పెద్ద పండుగ. ఈ పండుగకు ఇంకా ఏడు వారాలపైనే సమయం ఉంది. అయినప్పటికీ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకోవడంతో  రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి.

New Update
Special Trains

Special Trains

Sankranti: సంక్రాంతి అనగానే తెలుగువారికి చాలా ముఖ్యమైన పండుగ.అందులోనూ ఆంధ్రప్రదేశ్‌ వారికి అతి ముఖ్యమైన పండుగ. ఈ పండుగకు ఇంకా ఏడు వారాలపైనే సమయం ఉంది. అయినప్పటికీ దూర ప్రాంతాలకు వెళ్లా్ల్సిన వారు ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకోవడంతో  రైళ్లలో రిజర్వేషన్లు అయిపోయాయి. కొన్నిట్లో  వేయిటింగ్‌ ఐదారొందలు దాటేసింది. గోదావరి, గరీబ్‌రథ్, ఈస్ట్‌కోస్ట్, కోణార్క్, మహబూబ్‌నగర్‌-విశాఖపట్నం, చార్మినార్, సింహపురి, గౌతమి, శబరి, నారాయణాద్రి, పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్లలో... గరిష్ఠ పరిమితిని దాటేసి ‘రిగ్రెట్‌’కు చేరింది. బస్సుల్లోనూ ముఖ్యమైన పట్టణాలకు రిజర్వేషన్లు ఫుల్‌ అయ్యాయి. విమాన టికెట్ల ధరలకూ రెక్కలు వచ్చాయి.  

నాలుగు రోజులు ఫుల్‌ డిమాండ్‌

జనవరి 14(బుధవారం)న సంక్రాంతి అవుతోంది. ముందురోజు భోగి, తర్వాత రోజు కనుమ అవుతోంది. దాంతో జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు రైళ్లు, బస్సుల ప్రయాణాలకు భారీ డిమాండ్‌ ఉండనుంది. ఎక్కువ మంది శుక్ర, శనివారాల నుంచి ప్రయాణాలు మొదలు పెడుతున్నారు. దూరప్రాంత రైళ్లలో 9వ తేదీ నుంచే రిజర్వేషన్లు అయిపోయాయి. బస్సులకు 10వ తేదీ నుంచి 13 తేదీ వరకు డిమాండ్‌ అధికంగా ఉంది. ప్రధాన రైళ్లలో... హైదరాబాద్‌ నుంచి విజయవాడ,  నరసాపురం, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, కాకినాడ, నెల్లూరు తదితర నగరాలు, పట్టణాలకు జనవరి 9-13 వరకు వెయిటింగ్‌ లిస్టు దాటేసి రిగ్రెట్‌కు చేరడం గమనార్హం.  ఇక హైదరాబాద్‌ నుంచి మహబూబాబాద్, ఖమ్మంకు వందేభారత్, ఈస్ట్‌కోస్ట్, చార్మినార్, గరీబ్‌రథ్,  గోదావరి ఎక్స్‌ప్రెస్‌ల్లో రిగ్రెట్‌ చేరుకుంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతి, చిత్తూరుకు శబరి ఎక్స్‌ప్రెస్‌లో 10, 11 తేదీల్లో, వెంకటాద్రిలో 10, 12న రిగ్రెట్‌ కనిపిస్తోంది... మిగతా రోజుల్లో పెద్ద ఎత్తున వేయిటింగ్‌లిస్ట్‌ ఉంది. హైదరాబాద్‌ నుంచి ఏపీ వైపు వెళ్లే అన్ని ఏపీఎస్‌ఆర్టీసీ అన్ని బస్సుల్లో సీట్లు నిండిపోయాయి.

కొత్త సర్వీసులు వేస్తారా?

సంక్రాంతి పండుగ అంటేనే తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ పండుగకు జనాలు ఎక్కువగా గ్రామాలకు వెళ్తారన్నది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్ర వైపు ఎక్కువగా రద్దీ ఉంటుంది. సాధారణంగా ఒక రూట్లో ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్‌ ఉంటే రైల్వే, ఆర్టీసీలు  ప్రత్యేక సర్వీసులు ప్రకటించాలి. ఒక రైలులో వెయిటింగ్‌ లిస్టు మూడు, నాలుగొందలు దాటిందంటే వెంటనే ... అదే రూట్లో ప్రత్యేక రైలు ప్రకటిస్తే ప్రయాణికులు అందులో రిజర్వేషన్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వేయిటింగ్‌ లిస్ట్‌ ఐదారొందలు దాటి ‘రిగ్రెట్‌’కు చేరినా ఇప్పటివరకు రైల్వే శాఖ ప్రత్యేక రైలు ప్రకటనలు చేయలేదు. ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా  ప్రత్యేక బస్సులను ఆన్‌లైన్‌లోకి ఇంతవరకు తీసుకురాలేదు. టీజీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే కొంత వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే సమయంలో ప్రయాణికుల డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు ఆపరేటర్లు ఛార్జీలను విపరీతంగా పెంచుతున్నారు. సాధారణ రోజుల కంటే రెండింతలు వసూలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇక విమాన ప్రయాణాలకు జనవరి 10, 11 తేదీల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది.  దీంతో టికెట్ల ధరలు 50-100% పెరిగాయి. హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం విమాన ఛార్జీలు సాధారణ రోజుల్లో రూ.4,600-4,900 ఉంటే జనవరి 10న రూ.10,529, 11న రూ.8,695గా, 9న రూ.7,075 గా పెంచారు. హైదరాబాద్‌ -విశాఖకు సగటున టికెట్‌ ధర రూ.4,144 ఉంటే... జనవరి 10న రూ.7,366, 11న రూ.6,443 వరకు పెరగడంతో ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానయాన సంస్థలు కూడా మరిన్ని విమానాలు నడుపుతాయా లేక వీటితోనే సరిపెడుతాయా? అనేది ఇంతవరకు సమాచారం లేదు.

Advertisment
తాజా కథనాలు