Kavitha-Prashant Kishor: కవితతో భేటీ.. ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన!

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లోకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నారని.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్థాపించే రాజకీయ పార్టీకి ఆయన వ్యూహ రచన చేయనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.

New Update
FotoJet - 2026-01-20T145957.282

Kavitha Prashant Kishor Meeting

Kavitha Prashant Kishor Meeting : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లోకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(prashant-kishore) మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నారని.. తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) అధ్యక్షురాలు కవిత(kalvakuntla-kavitha) స్థాపించే రాజకీయ పార్టీ(political-party) కి ఆయన వ్యూహ రచన చేయనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరణకు గురయిన కవిత స్థాపించనున్న పార్టీకి పని చేస్తారని సమాచారం. ఆమె ఏర్పాటు చేసే పార్టీ కోసం పీకే పని చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కవితతో కలిసి పని చేసేందుకు పీకే ఆసక్తి కనబరిచారని గత రెండు రోజులుగా విస్తృత ప్రచారం సాగుతోంది.

Also Read :  ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కవితతో భేటీ ఊహాగానాలే: ప్రశాంత్ కిషోర్

అయితే ఈ ప్రచారాన్ని ప్రశాంత్‌ కిశోర్‌(Prashant Kishor party) ఖండించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడంపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కలిసి చురుగ్గా చర్చించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ అవన్నీ వట్టి ఊహాగానాలే తేల్చి చెప్పారు.  

కలిసింది నిజమే :

కాగా, కవిత కొత్త పార్టీ, ప్రశాంత్‌ కిశోర్‌తో భేటీ గురించి రాజకీయ వర్గాల్లో సాగుతున్న  సందడి గురించి కవిత సన్నిహితులు మాత్రం నిజమే అని చెప్తున్నారు. ఇద్దరి మధ్య ఏదో ఒక రకమైన చర్చలు సాగుతున్న మాట నిజమేనని తేల్చి చెప్పారు. ఈ ఊహాగానాలకు ఏదైనా ఆధారం ఉందా అని తెలుసుకోవడానికి కవితకు అత్యంత సన్నిహితుడిగా  పేరున్న వ్యక్తిని సంప్రదించినపుడు. , కిషోర్ గత రెండు నెలల్లో రెండుసార్లు హైదరాబాద్ సందర్శించి కవితతో సమావేశాలు జరిపాడు. సంక్రాంతి సందర్భంగా, చర్చలు దాదాపు ఐదు రోజుల పాటు కొనసాగాయని, ప్రతిపాదిత రాజకీయ పార్టీ యొక్క నిర్మాణం, పనితీరుపై దృష్టి సారించాయని తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని అంచనా వేయడం నుండి రాష్ట్రంలో కొత్త వేదిక యొక్క సాధ్యత వరకు సంభాషణలు సాగాయని వారు చెప్పారు.

కాగాసోమవారం, కవిత తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో అన్ని కమిటీల సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం తర్వాత విడుదల చేసిన ఒక ప్రకటనలో, తెలంగాణ జాగృతి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఒక బ్లూప్రింట్‌ను రూపొందిస్తోందని, ప్రజా సమస్యలు మరియు వనరుల వినియోగాన్ని అధ్యయనం చేసిన తర్వాత, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రాజకీయ పార్టీని ప్రారంభించాలని కమిటీలు సిఫార్సు చేశాయని ఆమె తెలిపారు.

Also Read :  తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ సాధ్యమేనా ?

రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న కవితతో ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పటికే పలుమార్లు భేటీ అయినట్లు సమాచారం. తెలంగాణ ప్రజల కోసం  పార్టీ ఏర్పాటు.. ప్రజలు తమ పార్టీగా ఓన్ చేసుకోవడం.. ప్రజల కోణంలో ఎలా పని చేయాలనే అంశంపై పీకేతో కవిత చర్చించినట్లు సమాచారం. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కవిత ప్రయత్నాలు కొనసాగుతున్న క్రమంలో పీకేతో భేటీ కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజల కోణంలో పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలు ఏర్పాటు చేసి కవిత పార్టీ ఏర్పాటు పై అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో కవిత వేగం పెంచారు. తాను ఏర్పాటు చేసే పార్టీ కోసం పీకేతో పని చేయాలని కవిత నిర్ణయించుకున్నారు. పలుమార్లు వీరిద్దరూ భేటీ అయి చర్చలు జరగ్గా.. కవితతో కలిసి పని చేసేందుకు పీకే ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. గతంలో విజయవంతంగా అనేక పార్టీలకు రాజకీయ వ్యూహ రచన చేసిన ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల బిహార్‌లో రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయంగా పూర్తిగా విఫలమయ్యాడు. బిహార్‌ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన పీకే ఇప్పుడు కవితకు పని చేస్తుండడం గమనార్హం.  

Advertisment
తాజా కథనాలు