విజయ్ బాటలో విశాల్.. పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం
తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. ఇటీవలే విజయ్ పొలిటికల్ పార్టీ స్థాపించగా ఇప్పుడు విశాల్ కూడా సొంత పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’ నిర్వాహకులతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.