బుమ్రాపై స్టోక్స్ షాకింగ్ కామెంట్స్.. 0తో సమానం అంటూ!

రెండో టెస్టులో బుమ్రా ప్లేయింగ్ లెవెన్ లో ఉంటాడో లేదో అనే సందేహాలపై ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బుమ్రా అంశం భారత్‌కు సంబంధించినది, ఎవరున్నా లేకపోయినా తాము ఆడి గెలిచేందుకు ప్రయత్నిస్తామన్నాడు.

New Update
ind vs eng

Cricket: రెండో టెస్టులో బుమ్రా ప్లేయింగ్ లెవెన్ లో ఉంటాడో లేదో అనే సందేహాలపై ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బుమ్రా అంశం భారత్‌కు సంబంధించినది, ఎవరున్నా లేకపోయినా తాము ఆడి గెలిచేందుకు ప్రయత్నిస్తామన్నాడు. ఈ మేరకు తాజాగా మీడియాతో మాట్లాడిన స్టోక్స్..‘బుమ్రాను ఆడించాలా లేదా అనేది భారత్‌ ఇష్యూ. వారే పరిష్కరించుకుంటారు. టీమ్‌ఇండియా మెరుగైన జట్టు. ప్రతి అంతర్జాతీయ జట్టుకు ఒత్తిడి ఉంటుంది. భారత్‌కు ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువే. అందుకే తొలి టెస్టులో ఓడినా.. టీమ్‌ఇండియాను తక్కువ అంచనా వేయట్లేదు. సిరీస్‌ను మళ్లీ -0తోనే మొదలుపెడతాం’అని స్టోక్స్‌ చెప్పాడు. 

ఎడ్జ్‌బాస్టన్‌ లో చరిత్ర మారేనా..

ఇంగ్లాండ్-ఇండియా మధ్య నేటినుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగనున్న మ్యాచ్ పై భారీ అంచనాలున్నాయి. ఈ గ్రౌండ్ లో ఆడిన 8 మ్యాచ్ ల్లో భారత్ 7 ఓడిపోగా 1 మ్యాచ్ డ్రా చేసుకుంది. దీంతో ఈసారైనా గెలుపు రుచి చూస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఈ మైదానంలో తిరుగులేని ఇంగ్లాండ్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.  మొదటి టెస్టు విజయంతో ఊపుమీద కనిపిస్తున్న ఇంగ్లాండ్ జట్టు.. మరింత ఆత్మవిశ్వాసంతో యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే తుది జట్టును ముందే ప్రకటించింది. మొదటి మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఇంగ్లాండ్‌ ఎలాంటి మార్పులు చేయలేదు. పిచ్‌ కూడా బ్యాటింగ్‌కు అనుకూలించేలా కనిపిస్తుండగా.. క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్‌తో ఆ జట్టు లైనప్‌ బలంగా కనిపిస్తోంది. 

ఇంగ్లాండ్‌: 
బెన్ స్టోక్స్(కెప్టెన్) క్రాలీ, డకెట్, ఒలీ పోప్, రూట్, బ్రూక్, , స్మిత్, వోక్స్, కార్స్, జోష్‌ టంగ్, బషీర్‌.

భారత్‌ (అంచనా): 
శుభ్ మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, పంత్, కరుణ్‌ నాయర్, జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌/కుల్‌దీప్, బుమ్రా/అర్ష్‌దీప్, సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ.

Advertisment
Advertisment
తాజా కథనాలు