/rtv/media/media_files/2025/07/02/dehydration-2025-07-02-13-40-20.jpg)
Dehydration
Dehydration: శరీరంలో నీరు లేకపోవడం వల్ల తరచుగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. అందుకే వీలైనంత ఎక్కువ నీరు తాగడం, నీటి శాతం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. డీహైడ్రేషన్ సమస్య సమయంలో కనిపించే కొన్ని సాధారణ లక్షణాలను ముందే సూచిస్తుంది. వాటిని ముందుగానే గుర్తే సమస్యను పెరగకుండా చూసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. డీహైడ్రూషన్ ఉన్నట్లు ముందుగా చూపించే లక్షల గురించి కొన్ని విషయాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
డీహైడ్రేషన్ సమస్య ఉందా..
- మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే డీహైడ్రేషన్ బాధితురాలిగా మారే అవకాశం ఉంది. దీనితోపాటు ముదురు మూత్రం కూడా ఈ సమస్యను సూచిస్తుంది. అటువంటి లక్షణాన్ని విస్మరించడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
- నోరు తరచుగా ఎండిపోతుందా..? అయితే శరీరానికి నీరు అవసరం అని అర్థం. అంటే శరీరంలో నీటి కొరత ఉంది. దీనితో పాటు డీహైడ్రేషన్ కారణంగా పెదవులు కూడా పగిలిపోవచ్చు. పొడిబారిన పెదవులు, నోరు ఎండిపోవడాన్ని చిన్న విషయంగా భావించి విస్మరించే పొరపాటు చేయవద్దు. లేకుంటే దాని పరిణామాలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
- శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు శరీరం శక్తి లేకపోవడం, అలసట, బలహీనత సమస్యను ఎదుర్కోవచ్చు. దీనితోపాటు తల తిరగడం కూడా నిర్జలీకరణ లక్షణం కావచ్చు. రోజుకు 4-5 సార్లు కంటే తక్కువ మూత్ర విసర్జన చేస్తుంటే..శరీరంలో నీరు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలను అస్సలు విస్మరించవద్దు. ఈ లక్షణాలన్నీ కలిసి కనిపిస్తే వెంటనే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.