/rtv/media/media_files/2025/01/31/vZMnJL1AQFJKPmWnMsst.jpg)
anirud reddy Photograph: (anirud reddy)
Viral Video: అంతా వెండి మయం.. ఇంతా రాజవైభోగాలా అన్నట్టుగా ఉంది. రూమ్‌లో ఎటు చూసినా వెండితో చేసిన వస్తువులే కనిపిస్తున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి(Jadcharla MLA Anirudh Reddy ) బెడ్‌రూమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆయన బెడ్‌రూమ్‌ని స్పెషల్‌గా డిజైన్ చేసుకున్నారు. వెండితో సోఫాసెట్లు, కూర్చీలు, బెడ్, డ్రసింగ్ టేబుల్ తయారు చేయించుకున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆయన గది ప్రత్యేకత గురించి వివరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది.
Also Read: TG News: తెలంగాణలో భూములు కొనాలనుకుంటున్న వారికి బిగ్ షాక్.. మరో 2 నెలల్లో!
పెట్టి పుట్టడమంటే ఇదేనేమో?
— Journalist Vijaya Reddy (@VijayaReddy_R) January 31, 2025
వెండితో బెడ్ చేయించుకున్న జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే
మామూలుగా అయితే ఇంట్లో వెండి ప్లేట్లు, గ్లాసులు, పూజ సామాగ్రి చుసుంటాం.. కానీ ఆయన ఇంట్లో బెడ్, డైనింగ్ టేబుల్ సహా అన్నీ వెండితో చేయించినవే..,,
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి pic.twitter.com/TMjUVY8DJE
Also Read: చనిపోయిన పేరెంట్స్ కు కుంభమేళాలో స్నానం.. ఆ కూతురు ఏం చేసిందంటే!-VIDEO VIRAL
వెండితో బెడ్ రూమ్..
2024 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనంపల్లి అనిరుద్ రెడ్డి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. అంతకు ముందు ఆయనకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. పెద్ద పారిశ్రామిక వేత్తగా అనేక మ్యానిఫాక్చరింగ్ యూనిట్లు నెలకొల్పారు. ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం కూడా చేశారు. తర్వాత రాజకీయాల్లోకి దిగారు. వెండిలో ఆయన బెడ్ రూమ్ ను ఇంటీరియర్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!
Also Read: ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్!