/rtv/media/media_files/2025/01/31/7zNxN6JySgTGu8MJCs02.jpg)
prabhasfood
యంగ్ రెబల్ స్టార్ తో సినిమా చేసేవాళ్లంతా చెప్పేమాట ఒకటే..ఆయన భోజనం పెట్టి చంపేస్తారని. చాలా మంది సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఇంటి భోజనం గురించి చెబితే, మరికొందరు ఇంటర్వ్యూల్లో తాము రుచి చూసిన ప్రభాస్ ఇంటి భోజనం గురించి వివరిస్తుంటారు. తాజాగా ఈ మాట కొత్త హీరోయిన్ ఇమాన్వి కూడా అనేసింది.
Also Read: America: సిరియా పై విరుచుకుపడిన అమెరికా..మోస్ట్ వాటెండ్ సీనియర్ ఉగ్రవాది హతం!
తాజాగా ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న ఇమాన్వి సోషల్ మీడియా ద్వారా రుచికరమైన వింధు భోజనం వీడియోను షేర్ చేయడం తో ఈ విషయం వైరల్ గా మారింది.ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఫౌజీ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ సమయంలో ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన భోజనాన్నిహీరోయిన్ ఇమాన్వి రుచి చూసింది.
Also Read: Jayalalitha: జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే...సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
చాలా రుచికరంగా...
ప్రభాస్‌కి థాంక్యూ చెప్పడంతో పాటు భోజనం చాలా రుచికరంగా ఉందంటూ ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నోట్లో నీళ్లూ వస్తున్న ఎమోజీని షేర్ చేయడం ద్వారా అందరి నోళ్ళు ఊరించింది. ప్రభాస్ ఇంటి భోజనానికి చాలా మంది అభిమానులు ఉంటారు. దీంతో ఇమాన్వి సైతం ఆ జాబితాలో చేరింది.
Thank You #Prabhas for this Yummy Yummy Goodness 🫶🤤🤤🤤🤤
— Prabhas Network™ (@PrabhasNetwork_) January 30, 2025
~ Our @Imanvi13 Insta Story 😍❤️ #PrabhasHanu #Imanvi 😂❤️ pic.twitter.com/KmnWAaJnKh
ఏ షూటింగ్ జరుగుతున్న సరే కేవలం ప్రభాస్ ఒక్కడి కోసం మాత్రమే ఇంటి నుంచి టిఫిన్ రాకుండా కనీసం 15 మందికి సరిపోయే విధంగా పది పన్నెండు రకాల వంటకాలు ప్రతి రోజూ సెట్స్‌కి వస్తాయట. ప్రభాస్ హైదరాబాద్ షూటింగ్‌లో ఉంటే కచ్చితంగా ఇంటి నుంచి భోజనం రావాల్సిందే అని సమాచారం.
ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు 'ఫౌజీ' టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇంకా అధికారికంగా టైటిల్‌ను ప్రకటించలేదు. రాజాసాబ్ సినిమాతో సమానంగా షూటింగ్‌ను జరుపుతున్న దర్శకుడు హను రాఘవపూడి 'ఫౌజీ' సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేసే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం.
ఈ వేసవి చివర్లోనే ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్వరలోనే అధికారికంగా డేట్‌ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.