BJP: జూబ్లీహిల్స్ లో బీజేపీదే గెలుపు.. ఆ పార్టీ చీఫ్ రామచందర్రావు చెప్పిన లాజిక్ ఇదే!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు ధీమా వ్యక్తం చేశారు. గత జీహెచ్ఎంసీ ఫలితాలు రిపీట్ కాబోతున్నాయన్నారు. నియోజకవర్గంలో సమీకరణాలు మారాయన్నారు.