Sai Pallavi: ఈ మధ్య ఇతిహాసాలను, చారిత్రక ఘట్టాలను సినిమా రూపంలో చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇలా ఇప్పటికే వచ్చిన పలు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఉదాహరణకు: చావా, ది కేసరి చాఫ్టర్ 2, రుద్రమదేవి. ఇదే తరహాలో ఇప్పుడు 'రామాయణం' కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ నిర్మాత నమిత్ మల్హోత్రా 'రామాయణం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ. 4000 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. అంతేకాదు ఇందులోని ప్రతీ పాత్ర, ప్రతీ సన్నివేశంపై ఎంతో శ్రద్ద వహిస్తున్నారు. ముఖ్యంగా సీతారాముల పాత్రల విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకే సీతగా సాయిపల్లవి
అయితే తాజాగా ఓ చిట్ చాట్ లో పాల్గొన్న చిత్రబృందం ఈ సినిమాలో ప్రత్యేకంగా సాయిపల్లవిని సీతగా ఎంపిక చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది. ''సాయిపల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుందని, అందం కోసం సర్జరీలు చేయించుకోలేదని, కృత్రిమం కంటే సహజ అందమే బాగుంటుందనే సందేశం ఇచ్చినట్లుగా ఆమె ఉంటుందని తెలిపారు''. అందుకే సీతాదేవిగా సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అలాగే రాముడిగా రన్బీర్ ఎంపిక చేయడానికి గల కారణాన్ని కూడా తెలిపారు. అయన ప్రశాంతమైన వ్యక్తిత్వం, గొప్పగా నటించే నైపుణ్యమే కారణమని చెప్పింది చిత్రబృందం.
#SaiPallavi as Sita would be timeless in #Ramayana. She's a perfect blend of BEAUTY, GRACE n STRENGTH..her Presence Her DIVINE AURA She’s the only one who can radiates the energy n calmness of Maa Sita on Big Screen. Especially she has ACTING SKILLS which every1 lacks in this GEN pic.twitter.com/fpcxv9RKcT
— Sai Pallavi FC™ (@SaipallaviFC) July 4, 2025
ఇక మిగతా పాత్రల విషయానికొస్తే.. సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, లారా దత్త కైకేయిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా కనిపించనున్నారు. యుగాలు మారినా, తరాలు మారినా 'రామాయణం' ఎప్పటికీ గొప్ప ఇతిహాసం! అలాంటి ఈకథను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూడాలనే ఉద్దేశంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్ వీడియో ఎంతో ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ఉంది. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. వచ్చేఏడాది దీపావళి కానుకగా మొదటి భాగం, 2027 దీపావళి కానుకగా రెండవ భాగం రిలీజ్ కానున్నాయి.