Weather Report : తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం...దంచికొడుతున్న వర్షం
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్నటి నుంచి పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉంది.