అటో శవం.. ఇటో శవం ప్రేమికులిద్దరూ కలిసి.. ! | Lovers Suicide At Visakhapatnam | RTV
నిజామాబాద్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు చక్రవర్తుల నందిత, సూరారం శ్రీకాంత్‌లుగా గుర్తించారు. అయితే ఈ ప్రేమజంట ఆత్మహత్యకు గల కారణాలు ఇంతవరకు తెలియలేదు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో విషాదం చోటుచేసుకుంది. ఓ లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా, యువకుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.