Mini Medaram Jatara : మినీ మేడారం జాతరకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్... వారికి మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా?
తెలంగాణలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది మేడారం జాతర. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కుంభమేళా తరహాలో మేడారం జాతరకూ కోట్లాది మంది భక్తులు వస్తుంటారు.