/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
- Nov 28, 2024 21:21 IST
కొండా సురేఖకు బిగ్ షాక్.. నాంపల్లి కోర్టు సమన్లు జారీ!
నటుడు నాగార్జున ఇష్యూలో మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 12న జరిగే విచారణకు హాజరుకావాలని కొండా సురేఖను న్యాయస్థానం ఆదేశించింది.
/rtv/media/media_files/tz7UpQsMgofKoQ39UzQa.jpg)
Also Read : https://rtvlive.com/telangana/nampally-court-issued-summons-to-konda-surekha-telugu-news-7656037
- Nov 28, 2024 20:58 IST
ప్రయాణించే రైళ్లు ఆలస్యంగా వెళ్తే నష్టపరిహారం పొందొచ్చు.. ఎలాగంటే?
మీరు ప్రయాణించే రైళ్లు ఆలస్యంగా వెళ్తే నష్టపరిహారం పొందొచ్చు. ట్రైన్ లేటు అయినప్పుడు ప్రయాణికులు ఫోరంను ఆశ్రయించాలి. అనంతరం తగిన కారణం చూపి నష్టపరిహారాన్ని పొందొచ్చు. అయితే వీటికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి.
/rtv/media/media_files/2024/11/28/zfN0aQmJBjphUvbpXq6O.jpg)
Also Read : https://rtvlive.com/national/indian-railway-rules-ensure-fine-for-delayed-trains-7655842
- Nov 28, 2024 20:39 IST
సంస్కృతం 'జనని' అయితే గనక.. అది కుట్రే!
'సంస్కృతం అన్ని భాషలకు జనని' అని చెప్పడం కూడా ఓ కుట్రే అని వ్యాసకర్త డాక్టర్ దేవరాజు మహారాజు అన్నారు. ఎందుకంటే ఆ భాషతోనే అగ్రవర్ణాలు తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నాయని చెప్పారు. లిపి లేని సంస్కృతం ఒక 'బోలీ' అంటూ ఆసక్తికర చర్చకు దారితీశారు.
/rtv/media/media_files/2024/11/28/QGir9eyu31v95GiehKxY.jpg)
- Nov 28, 2024 19:40 IST
నన్ను అరెస్టు చేయాలని చూస్తే.. RGV షాకింగ్ ట్వీట్
రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్ చేశారు. తనపై నమోదైన కేసు, జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తానేక్కడికీ పారిపోలేదన్నారు. అసలు పోలీసులు తన ఆఫీసులోకి రాలేదన్నారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వ్యక్తులు తనపై కేసు పెట్టడం వింతగా ఉందన్నారు.
నా కేసు —- RGV @ndtv@IndiaToday@TimesNow@republic@TV9Telugu@NtvTeluguLive@sakshinews@tv5newsnow@BBCWorld@DDNewslive@ZeeNews
— Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2024
1.
నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ…Also Read : https://rtvlive.com/cinema/director-ram-gopal-varma-shocking-tweet-7650945
- Nov 28, 2024 19:00 IST
అదానీ ఇష్యూలో జగన్ పరువు నష్టం దావా.. వారందరికీ లీగల్ నోటీసులు!
అదానీ దగ్గర లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ఎఫ్‌బీఐ ఛార్జిషీట్‌లో తన పేరు ఎక్కడా లేదని తెలిపారు. అనవసరంగా నిందలు వేసిన వారిపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు వెల్లడించారు.
/rtv/media/media_files/2024/11/22/oMZaKA6Bili0XFngG6KM.jpg)
- Nov 28, 2024 15:50 IST
పెళ్లి వేడుకలో విషాదం నింపిన డీజే!
పెళ్లి ఊరేగింపులో డీజే వాహనం అదుపు తప్పి నవ వధూవరుల వాహనాన్ని ఢీకొట్టిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు అక్కడిక్కడే మృతి చెందడంతో కుటుంబం శోక సంద్రంలోకి మునిగిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే డీజే డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
/rtv/media/media_files/2024/11/28/tdSZXOM7DlPBSoM9Xmin.webp)
- Nov 28, 2024 15:47 IST
ఇథనాల్ కంపెనీలో కొడుకుకు వాటా.. అది వాస్తవమేనన్న తలసాని శ్రీనివాస్!
ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తన కొడుకు కంపెనీ పెట్టాలనుకున్నది నిజమే కానీ అది ఇథనాల్ కాదన్నారు. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/talasani.jpg)
Also Read : https://rtvlive.com/telangana/talasani-srinivas-yadav-responds-ethanol-company-issue-telugu-news-7622529
- Nov 28, 2024 13:21 IST
జైలు బయటే చిందేసిన ఖైదీ..వైరల్ అవుతున్న వీడియో
యూపీలోని కన్నౌజ్‌కు చెందిన శివ అనే వ్యక్తికి ఓ దాడి కేసులో జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో జైలు బయట పాటకు మైకేల్ జాక్సన్ స్టెప్పులతో దుమ్ములేపాడు. శివ డ్యాన్స్ చూసిన నెటిజెన్లు మెచ్చుకుంటున్నారు.
/rtv/media/media_files/2024/11/28/Xkrk2dBul4o9BwLSg8Rq.webp)
- Nov 28, 2024 11:52 IST
ఛీ వీళ్లు మనుషులా?.. తల్లిని శ్మశానంలో వదిలేశారు
తల్లిని భారంగా భావించిన కొడుకులు ఏకంగా శ్మశానంలో వదిలేశారు. 8 రోజులుగా రాజవ్వ మోతేలోని శ్మశానవాటికలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. సంక్షేమశాఖ అధికారులు రాజవ్వను ఆస్పత్రికి తరలించారు.
/rtv/media/media_files/2024/11/28/NOM1ASe3GVDOdZyJM9k9.jpg)
- Nov 28, 2024 10:43 IST
ఆర్జీవీ సంచలన నిర్ణయం!
ఏపీ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు ఆర్జీవీ. తాను ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుపై చట్టవిరుద్ధంగా అనేక కేసులు పెడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశించాలని కోరారు. ఈరోజు ఈ పిటిషన్‌ను కోర్టు విచారించనుంది.
/rtv/media/media_files/2024/11/28/oDjNO6aIwCAhd8L1zd4a.webp)
https://rtvlive.com/cinema/rgv-filed-another-petiton-against-cases-in-ap-high-court-7614509
- Nov 28, 2024 10:13 IST
ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ!
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఏసీ బస్సుల్లో 20శాతం రాయితీని ప్రకటించింది.విజయవాడ నుంచి హైదరాబాద్, విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే బస్సుల్లో 20శాతం, 10శాతం ఆయా బస్సుల్ని బట్టి రాయితీని ప్రకటించారు.
/rtv/media/media_files/2024/11/28/F8RXHFSsvnV7BLJYiaa1.webp)
https://rtvlive.com/andhra-pradesh/apsrtc-announce-20-percent-discount-on-ac-buses-charges-7614350
- Nov 28, 2024 09:00 IST
BREAKING: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు!
AP: వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణదాస్ గతంలో ప్రభుత్వ పీఏగా పనిచేసిన మురళి నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. మురళికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు నేపథ్యంలో ఈ దాడులు జరుపుతున్నారు.
/rtv/media/media_files/2024/11/28/7qCJInHtxyTtLTeAxfym.jpg)
- Nov 28, 2024 08:59 IST
BREAKING: కేటీఆర్‌పై సీఐడీ విచారణ?
TG: కేటీఆర్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై చేసిన భూ దందాల వ్యవహారంపై సీఐడీతో విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. గత పదేళ్లుగా మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ సిరిసిల్ల జిల్లాల్లో భూ దందాలు చేశారని ఆరోపణలు చేశారు.
/rtv/media/media_files/2024/11/28/sNCyCAd2bS3IkC8W5FHl.webp)
https://rtvlive.com/telangana/congress-mla-srinivas-demands-cid-enquiry-on-ktr-7614254
- Nov 28, 2024 07:34 IST
శుక్రవారం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు..ఇంకో 4 రోజులు
ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజులు వర్షాలు కురవనున్నాయి.రుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. బుధవారం రాత్రికి తుపానుగా బలపడింది.కోస్తాంధ్ర జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..రాయలసీమలో భారీ వానలు పడతాయని అధికారులు తెలిపారు.
/rtv/media/media_files/2024/11/28/l7o3be3KRS6JrsE1RGLS.webp)
- Nov 28, 2024 07:25 IST
11 రోజులు..5 హత్యలు..ఒంటరి మహిళలే లక్ష్యం!
తన వైకల్యాన్ని అవకాశంగా మలచుకొని దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలకు పాల్పడ్డాడు ఓ సైకో కిల్లర్.జైలు నుంచి విడుదలైన నిందితుడు రాహుల్ కేవలం 11 రోజుల్లో 5 హత్యలు చేశాడు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో..
/rtv/media/media_files/2024/11/28/KlwAWXN1DJ8erylqhh0U.webp)
https://rtvlive.com/telangana/hyderabad-5-murders-with-in-11-days-psycho-killer-7614186
- Nov 28, 2024 07:18 IST
ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!
TG: రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 30న రూ.2 లక్షలు రుణమాఫీ కానీ వారందరికీ రుణమాఫీ జరగనున్నట్లు చెప్పారు. వివిధ కారణాల వల్ల దాదాపు 4 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు
/rtv/media/media_files/2024/11/28/9PsqfseXWSISZ8UWxOz2.webp)
https://rtvlive.com/telangana/telangana-government-to-release-runamafi-funds-on-nov-30-7614203
Follow Us