BREAKING: ఆర్జీవీ సంచలన నిర్ణయం!

ఏపీ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు ఆర్జీవీ. తాను ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుపై చట్టవిరుద్ధంగా అనేక కేసులు పెడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశించాలని కోరారు. ఈరోజు ఈ పిటిషన్‌ను కోర్టు విచారించనుంది.

New Update
RGV

RGV: వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన మరోసారి ఏపీ హైకోర్టును  ఆశ్రయించారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు. చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని ఆర్జీవీ పిటిషన్నే వేయగా.. నేడు ఆ పిటిషన్‌ హైకోర్టులో విచారణకు రానుంది.

ఇది కూడా చదవండి: తెలంగాణ రైతులకు ఓ గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్

ఆర్జీవీ టార్గెట్ గా కేసులు...

గత వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా టీడీపీని, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టారు. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రివెంజ్ ప్లాన్ చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఆర్జీవీ పై వివిధ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్జీవీపై మొత్తం తొమ్మిది కేసులు నమోదు అయినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!

ఈ క్రమంలో పోలీసులు ఆర్జీవీ అరెస్ట్ చేస్తారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. ఆర్జీవీ పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుల నుంచి తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వరుస వాయిదాలు పడుతున్నాయి. దీంతో ఆర్జీవీ ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరి ఆర్జీవీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా? లేదా?.. ఒకవేళ ముందస్తు బెయిల్ రాకపోతే ఆర్జీవీ అరెస్ట్ తప్పదా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. 

ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు!

ఇది కూడా చదవండి: సర్కార్ స్కూళ్లలో స్పోకెన్ ఇంగ్లీష్.. అక్కడి నుంచే స్టార్ట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు