నన్ను అరెస్టు చేయాలని చూస్తే.. RGV షాకింగ్ ట్వీట్ రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్ చేశారు. తనపై నమోదైన కేసు, జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తానేక్కడికీ పారిపోలేదన్నారు. అసలు పోలీసులు తన ఆఫీసులోకి రాలేదన్నారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వ్యక్తులు తనపై కేసు పెట్టడం వింతగా ఉందన్నారు. By Seetha Ram 28 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తాజాగా సంచలన ట్వీట్ చేశారు. తనపై నమోదైన కేసు, జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తానెక్కడికీ పారిపోలేదని.. అందరినీ నిరాశ పరిచినందుకు సారీ అంటూ తెలిపారు. అంతేకాకుండా పోలీసులు ఎవ్వరూ తన ఆఫీసుకు రాలేదని ట్వీట్‌లో రాసుకొచ్చారు. Also Read: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ! మీ అందరికీ బ్యాడ్ న్యూస్: ఆర్జీవీ తానేను ఏదో పరారీలో ఉన్నానని.. ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు తన కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అన్నారు. ఎందుకంటే ఈ టైమ్ అంత తాను తన డెన్ ఆఫీసులోనే ఉన్నానని.. అప్పుడప్పుడు తన సినిమా పనుల కోసం బయటకి వెళ్ళానని తెలిపారు. అంతేకాకుండా పోలీసులు ఇంత వరకు తన ఆఫీసులోకి కాలే పెట్టలేదన్నారు. పైగా తనను అరెస్టు చేయడానికి వచ్చినట్లు తన మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదని.. ఒక వేళ తనను అరెస్టు చేయడానికే వస్తే తన ఆఫీసులోకి ఎందుకు రారు? అని ప్రశ్నించారు. నా కేసు —- RGV @ndtv @IndiaToday @TimesNow @republic @TV9Telugu @NtvTeluguLive @sakshinews @tv5newsnow @BBCWorld @DDNewslive @ZeeNews 1.నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ… — Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2024 Also Read: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్ అంతేకాకుండా ఏడాది క్రితం పెట్టిన పోస్టులకు తన మీద కేసు నమోదైందని.. అదీ వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వ్యక్తులు తనపై కేసు పెట్టడం వింతగా ఉందని అన్నారు. తనకు నోటీసు అందిన వెంటనే, తన సినిమా పనుల వల్ల సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగిందని.. ఆయన కూడా అనుమతించడం జరిగిందని అన్నారు. Also Read: Crime: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా? కానీ తన పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడిగానని అన్నారు. అదే టైమ్‌లో తన మీద అన్నీ వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనక ఏదో కుట్ర ఉందని పేర్కొన్నారు. Also Read: అఖిల్ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు! అలాగే తాను తన మొబైల్ ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయటానికి ప్రధాన కారణం ఉందన్నారు. లెక్కలేనన్ని మీడియా కాల్స్ రావడంతోనే తాను తన ఫోన్ స్విచ్చాఫ్ చేశానని తెలిపారు. కాగా దీని వెనుక ఏదో జరుగుతుందని అర్థం అవుతోందన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని.. అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలును కచ్చితంగా పాటిస్తానని అన్నారు. #arrest #tollywood #rgv-tweet #rgv మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి