BREAKING: కేటీఆర్‌పై సీఐడీ విచారణ?

TG: కేటీఆర్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై చేసిన భూ దందాల వ్యవహారంపై సీఐడీతో విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సీఎం రేవంత్‌ రెడ్డి ని కోరారు. గత పదేళ్లుగా మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ సిరిసిల్ల జిల్లాల్లో భూ దందాలు చేశారని ఆరోపణలు చేశారు.

author-image
By V.J Reddy
New Update
KTRRR

MLA KTR: మాజీ మంత్రి కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై చేసిన భూ దందాల వ్యవహారంపై సీఐడీతో విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సీఎం రేవంత్‌ రెడ్డి ని కోరారు. గత పదేళ్లుగా మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ సిరిసిల్ల జిల్లాల్లో భూ దందాలు చేశారని.. ఆయనతో పాటు ఉన్న అనుచరులు కూడా ఈ దందాలు చేసినట్టు ఆరోపణలు చేశారు. కాగా ఇప్పటికే ఫార్ములా ఈ రేసు, లగచర్ల కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్ ఇక్కట్లు పడుతున్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!

కేటీఆర్...  కలెక్టర్‌కు సారీ చెప్పు...

ఇటీవల ఓ సభలో కేటీఆర్ మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను అసభ్య పదజాలాలతో దూషించడంపై వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఒక కలెక్టర్ ను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం తగదని అన్నారు. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. వెంటనే జిల్లా కలెక్టర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు!

ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత పద్దేళ్లు మంత్రిగా ఉన్న కేటీఆర్ సిరిసిల్లలో భారీగా భూ దండాలు చేశారని ఆరోపణలు చేశారు. కేటీఆర్ తో ఆయన అనుచరులు భూదందా, ఇసుక దందా చేశారని.. ఇప్పుడు ఆ దండాలు అన్ని బయటపెడుతారనే భయంతో కలెక్టర్ పై కేటీఆర్ అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. అధికారం ఉందన్న పేరుతో తన అనుచరులకు కేటీఆర్ వందల ఎకరాల భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. అనర్హుల చేతికి వెళ్లిన 150 ఎకరాలను కలెక్టర్‌ వెనక్కి తీసుకుంటున్నారని, ఆయనపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల సంఘం స్పందించాలని కోరారు. సిరిసిల్లలో జరిగిన అక్రమాలపై శాఖాపరమైన విచారణ జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి విజ్ఞప్తి చేశారు. మరి ఈ అంశం కేటీఆర్ మెడకు ఉచ్చుల చుట్టుకుంటుందా? లేదా? అనేది వేచి చూడాలి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు