DJ Vehicle: పెళ్లి వేడుకలో విషాదం నింపిన డీజే! పెళ్లి ఊరేగింపులో డీజే వాహనం అదుపు తప్పి నవ వధూవరుల వాహనాన్ని ఢీకొట్టిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు అక్కడిక్కడే మృతి చెందడంతో కుటుంబం శోక సంద్రంలోకి మునిగిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే డీజే డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Kusuma 28 Nov 2024 in క్రైం ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి ఏపీలోని కర్నూలులో ఓ వివాహ వేడుకలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోసిగి మండలంలోని సజ్జలగుడ్డం గ్రామంలో పెళ్లయిన తర్వాత ఉరేగింపు నిర్వహిస్తుండగా డీజే వాహనం కింద పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన దారుణ ఘటన జరిగింది. సజ్జలగుడ్డం గ్రామానికి చెందిన ఆర్లబండ నాగేష్ కొడుకు బసవరాజుకి బుధవారం ఉదయం వివాహం జరిగింది. ఇది కూడా చూడండి: IPL-2025: ఫ్రాంఛైజీలు కొనుగోలు, రీటైన్ చేసుకున్న ఆటగాళ్ళ లిస్ట్ ఇదే.. పెళ్లయిన తర్వాత ఉరేగింపు నిర్వహిస్తుండగా.. ఈ క్రమంలో ఆ రోజు రాత్రి గ్రామంలో ఉరేగింపు నిర్వహించగా.. డీజే వాహనం అదుపుతప్పి నవ వధూవరుల వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఏడేళ్ల బాలుడు చనిపోయాడు. వెనుక వైపు నుంచి బాలుడి తలభాగంపై వాహనం వెళ్లింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు చావును తట్టుకోలేక కుటుంబ సభ్యులు పెళ్లి వాహనాలను ధ్వంసం చేశారు. ఇది కూడా చూడండి: ఊహించని రేంజ్‌లో ఐపీఎల్ బిజినెస్.. మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి! బాలుడు మరణించడంతో డ్రైవర్లు, వాహన యజమానులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే పోలీసులు విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కుమారుడు చావుతో ఆ కుటుంబం మొత్తం శోక సంద్రంలోకి మునిగిపోయింది. మృతి చెందిన ఆ బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. ఇది కూడా చూడండి: Rishab pant: ఢిల్లీని వీడటంపై పంత్ ఎమోషనల్.. మరీ ఇంత ప్రేమనా! పారిపోయిన డ్రైవర్లు, వాహన యజమానుల కోసం గాలిస్తున్నారు. అలాగే ప్రమాదం చేసిన ఆ వాహనాలను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీటిని పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. తమ కుమారుడిని చంపిన వారిని తప్పకుండా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నిందితులకు ఎలాగైన శిక్ష పడేలా చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇది కూడా చూడండి: 16 ఏళ్ల తర్వాత కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టులో న్యాయం.. #andhra-pradesh #marriage #dj #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి