Konda Surekha: కొండా సురేఖకు బిగ్ షాక్.. నాంపల్లి కోర్టు సమన్లు జారీ! నటుడు నాగార్జున ఇష్యూలో మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 12న జరిగే విచారణకు హాజరుకావాలని కొండా సురేఖను న్యాయస్థానం ఆదేశించింది. By srinivas 28 Nov 2024 | నవీకరించబడింది పై 28 Nov 2024 21:23 IST in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి నటుడు నాగార్జున ఇష్యూలో మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 12న జరిగే విచారణకు హాజరుకావాలని కొండా సురేఖను న్యాయస్థానం ఆదేశించింది. Also Read : నగ్నంగా నటించలేదు జీవించా.. ఆ టైమ్‌లో నో చెప్పలేకపోయా! వివరణ ఇవ్వండి.. ఈ మేరకు డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరుకావాలన్న కోర్టు తెలిపింది. ఇక తన ఫ్యామిలీని కించపరిచేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు. దీంతో నాగార్జున ఫిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం కోర్టు ఎదుట హాజరైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. Also Read : సంస్కృతం 'జనని' అయితే గనక.. అది కుట్రే! క్షమాపణ చెప్పిన వదలని నాగ్.. నాగ చైతన్య, సమంత విడాకుల విషయంలో కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ఆమె క్షమాపణలు చెప్పారు. అయిన కూడా నాగార్జున వెనక్కి తగ్గకుండా లీగల్ నోటీసులు పంపంచారు. కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబానికి భంగం కలిగించారని, కొండ సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు తాను చేసిన వ్యాఖలపై కొండా సురేఖ.. సమంతకు క్షమాపణలు చెప్పింది. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదు అంటూ ట్వీటర్లో రాసుకొచ్చింది. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా..నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు అంటూ కొండా సురేఖ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. Also Read : పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు సమంత రియాక్షన్.. సురేఖ వ్యాఖ్యలపై సమంత రియాక్ట్ అవుతూ.. విడాకులు నా వ్యక్తిగత విషయమని.. ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని పేర్కొంది. ఇందులో రాజకీయ నేతల ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది. '' ఒక మహిళగా బయటికి వచ్చి, గ్లామరస్ ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా సాహసం, శక్తి అవసరం. కొండా సురేఖ గారు.. నా జీవిత ప్రయాణంపై నేను గర్వపడుతున్నాను. దీన్ని చిన్న చూపు చూడకండి. ఒక మంత్రిగా మీ వ్యాఖ్యలు ప్రభావం చూపిస్తాయని మీరు గ్రహిస్తారని భావిస్తున్నాను. వ్యక్తుల ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. నా విడాకులు అనేవి వ్యక్తిగత విషయం. ఈ విషయం పట్ల దూరంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే మా విడాకులు జరిగాయి. ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదు. రాజకీయాల నుంచి నా పేరు దూరంగా ఉంచండి. నేనెప్పుడు రాజకీయాలకు దూరంగానే ఉంటా. అలాగే ఉండటం కొనసాగిస్తానని'' సమంత తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. Also Read : గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్ #nampally-court #konda-surekha #nagarjuna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి