అదానీ ఇష్యూలో జగన్ పరువు నష్టం దావా.. వారందరికీ లీగల్ నోటీసులు!

అదానీ దగ్గర లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ఎఫ్‌బీఐ ఛార్జిషీట్‌లో తన పేరు ఎక్కడా లేదని తెలిపారు. అనవసరంగా నిందలు వేసిన వారిపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు వెల్లడించారు.

author-image
By srinivas
New Update
Jaganmohan Reddy, Gautam Adani (1)

YS Jagan: అదానీ దగ్గర లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ఎఫ్‌బీఐ ఛార్జిషీట్‌లో తన పేరు ఎక్కడా లేదని, అనవసరంగా తనపై నిందలు వేస్తున్నవారిపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం అదానీ సోలార్ పవర్ ప్రాజెక్టు అవినీతికి సంబంధించిన ఇష్యూపై మీడియాతో మాట్లాడిన జగన్.. తనకు లంచం ఆఫర్‌ చేసినట్టు ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. కొందరు వాస్తవాలేంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

వారికి లీగల్ నోటీసులు..

'నేను అదానీని చాలాసార్లు కలిశాను. రాష్ట్రంలో అదానీకి చాలా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అదానీతో భేటీకి, విద్యుత్ ఒప్పందాలకు సంబంధం లేదు. తప్పుడు ఆరోపణలు చేసినవారిపై పరువునష్టం దావా వేస్తా. నా పరువుప్రతిష్ఠలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసిన వారికి లీగల్ నోటీసులు ఇస్తాం. అమెరికాలో పెట్టిన కేసు గురించి నాకు తెలియదు. బైడెన్‌ పేరు ఉంటే ఆయనను అడుగుతారా? తక్కువ ధరకు కరెంట్ తీసుకొస్తే నన్ను పొగడాల్సిందిపోయి, సన్మానించాల్సింది పోయి అభాండాలు మోపుతారా. రూ.2.49లకు కరెంట్ తీసుకొచ్చా. ధర్మం, న్యాయం ఉండాలి కదా. మంచి చేసినోడి మీద రాళ్లు వేస్తారా. ప్రభుత్వ ఖజానాకి భారం తగ్గించడం కూడా సంపద సృష్టే కదా. ఏమంటావ్ నారా చంద్రబాబు నాయుడు'అంటూ జగన్ అసహనం వ్యక్తం చేశారు. 

రెడ్ బుక్ పాలనలో రాష్ట్రం ఆగమైంది..

ఇక ఆంధ్రప్రదేశ్ తిరోగమనం వైపు పయనిస్తోందని జగన్ అన్నారు. రెడ్‌బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడిచారని, రాష్ట్రంలో లిక్కర్, ఇసుక స్కామ్‌లతో పాటు పేకాట క్లబ్బులే కనిపిస్తున్నాయని విమర్శించారు. ఆరోగ్యశ్రీలో రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. విద్యాదీవెన లేక డ్రాపౌట్లు పెరుగుతున్నాయని చెప్పారు. వాలంటీర్లకి రెట్టింపు వేతనం ఇస్తానని ఉద్యోగాలకే ఎసరుపెట్టేశారని మండిపడ్డారు. తాము గ్రామాల్లోనే వందలాది సేవలు అందిస్తూ గ్రామ స్వరాజ్యం సాధించామని.. ప్రజలకి వ్యయ ప్రయాసలు లేకుండా గుమ్మం ముందుకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చామని చెప్పారు. అలాంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు