Psycho Killer: 11 రోజులు..5 హత్యలు..ఒంటరి మహిళలే లక్ష్యం! తన వైకల్యాన్ని అవకాశంగా మలచుకొని దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలకు పాల్పడ్డాడు ఓ సైకో కిల్లర్.జైలు నుంచి విడుదలైన నిందితుడు రాహుల్ కేవలం 11 రోజుల్లో 5 హత్యలు చేశాడు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో.. By Bhavana 28 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Psycho Killer: అతడో సైకో కిల్లర్..తన వైకల్యాన్ని అవకాశంగా మలచుకొని దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలు ఇదే అతని జీవితం అయిపోయింది. జైలు నుంచి విడుదలై వచ్చిన 11 రోజుల్లోనే 5 హత్యలకు పాల్పడినట్లు గుజరాత్ పోలీసులు గుర్తించారు. హర్యానాకు చెందిన రాహుల్ జాట్ అలియాస్ భోలు ఈశ్వర్ జాట్ (29) అనే వ్యక్తి దుర్మార్గానికి యాదగిరిగుట్ట రైల్వేస్టేషన్ లో తెలుగు మహిళ రమణమ్మ బలయ్యారు. Also Read: AP : శుక్రవారం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు..ఇంకో 4 రోజులు రాహుల్ ఐదో సంవత్సరంలోనే పోలియో బారిన పడడంతో ఎడమ కాలికి వైకల్యం వచ్చింది. 2018-2019లో అతని పై ట్రక్ దొంగతనం, ఆయుధాల రవాణా పై రాజస్థాన్, హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్ లో కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులో జోద్‌పూర్ పోలీసులు అతన్ని జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలయ్యాక ఈ నెల 14న ఉద్వాడలో పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తున్న యువతిని మామిడితోటలోకి లాక్కెళ్లి హత్యాచారానికిపాల్పడ్డాడు. ఈ సైకో కిల్లర్ హత్య చేయాలనుకున్నప్పుడు రైలెక్కుతాడు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటాడు. Also Read: కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరాలి: బీజేపీ నేత అక్టోబర్‌లో మహారాష్ట్ర సోలాపూర్ స్టేషన్‌లో మహిళను, కైతర్ ఎక్స్‌ప్రెస్ లో ఓ వృద్దుణ్ణి హౌరా స్టేషన్ సమీపంలో హతమార్చాడు. కర్ణాటకలో ఓ ప్రయాణికురాలిని హత్య చేశాడు. పూణె- కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ లోనూ ఓ మహిళతో మాటలు కలిపి గొంతుకు తాడు బిగించి చంపేశాడు. వరుస హత్యలతో అప్రమత్తమైన మహారాష్ట్ర ,పశ్చిమ బెంగాల్ ,కర్ణాటక ,గుజరాత్ పోలీసులు హంతకుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.గుజరాత్ లోని ఉద్వాడ స్టేషన్ సమీపంలో 19 ఏళ్ల యువతి హత్యాచారం కేసుదర్యాప్తు చేపట్టిన పోలీసులకు మృతదేహం సమీపంలో ఓ సంచిని స్వాధీనంచేసుకున్నారు.అందులో దుస్తులు, తాడు, కత్తిని గుర్తించారు. Also Read: PAN CARD: కొత్త పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ ఏంటి? దీని వలన లాభాలేంటి? చుట్టుపక్కల స్టేషన్లలోని 5 వేల సీసీ టీవీ కెమెరాలు జల్లెడ పట్టారు. ఉద్వాడ స్టేషన్ లో గుర్తించి అనుమానితుడి ఫొటోను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, జైళ్లకు పంపించారు. దీంతో పోలీసులు నిందితుణ్ణి బాంద్రా-భుజ్ రైల్లో పట్టుకున్నారు. ఎలా దొరికాడంటే... నిందితుడు రాహుల్ పోలీసులకు ఎలా దొరికాడంటే...కర్నూలు జిల్లాకు చెందిన రమణమ్మ కుటుంబం ఉపాధి కోసం చాలా కాలం క్రితం కర్ణాటక వెళ్లింది. హైదరాబాద్ లో ఉన్న పెద్దకూతురుని చూసేందుకు తోర్నగల్ రైల్వే స్టేషన్ లో ఈ నెల 23న రాత్రి బెల్గావి-మణగూరు ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. మరుసటిరోజు ఉదయం తన అత్తను తీసుకుని వచ్చేందుకు వెళ్లిన వెంకటేశ్ దివ్యాంగుల కోచ్ లో రమణమ్మ చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తుచేపట్టారు. యాదగిరి స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెను టవల్ తో గొంతు నులిమి హతమార్చి గుజరాత్ లోని వాపి స్టేషన్ చేరినట్లు గుర్తించారు. Also Read: Ashwini Vaishnav: వావ్.. 'త్వరలో గంటకు 280 కి.మీ వేగంతో నడిచే రైళ్లు' మృతురాలి ఫోన్ బెంగళూరులో స్విచ్ఛాఫ్ చేసినట్లు నిర్థారించారు. అక్కడి పోలీసులు సీసీ టీవీ కెమెరాలు పరిశీలిస్తున్న సమయంలో ప్లాట్‌ఫామ్ పై కుంటుతూ నడుస్తున్న రాహుల్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని పీటీ వారెంట్ పై అరెస్ట్ చేసి తీసుకునివ్చేందుకు 29న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గుజరాత్ వెళ్లనున్నట్లు తెలిపారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి