BIG BREAKING: వినాయక మండపంలో ఘోర అగ్నిప్రమాదం..

పండుగపూట ఏపీలో ప్రమాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా పీలేరు వినాయక మండపంలో అగ్నిప్రమాదం జరిగింది. మండపంలో దీపం వెలిగించగా ప్రమాదవశాత్తు మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. దీంతో క్షణాల్లోనే మండపం పూర్తిగా కాలిపోయింది.

New Update
Fire Accident at Vinayaka Mandapam in annamayya District

Fire Accident at Vinayaka Mandapam in annamayya District

BIG BREAKING:

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు(Vinayaka Chavithi 2025) ఘనంగా జరుగుతన్నాయి. గల్లీ నుంచి మహా నగరాల వరకు వీధులన్నీ వినాయకుని మండపాలతో నిండిపోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే  పండుగపూట ఏపీలో ప్రమాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా పీలేరు వినాయక మండపం(Vinayaka Mandapam)లో అగ్నిప్రమాదం జరిగింది. మండపంలో దీపం వెలిగించగా ప్రమాదవశాత్తు మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. దీంతో క్షణాల్లోనే మండపం పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మండపం కాలిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇక వివరాల్లోకి వెళ్తే పీలేరులో వినాయక చవితి సందర్భంగా గణేషుని మండపం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరగడంతో భక్తులు భయాందోళనకు గుర్యయారు. మంటల ధాటికి అక్కడి నుంచి పరుగులు తీశారు. చివరికి మరికొందరు స్థానికులు నీళ్లు చల్లి మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో మండపంలో ఏర్పాటు చేసిన పూజా సామాగ్రి, మైక్‌ సిస్టమ్, కూర్చీలు అన్ని దగ్ధమైపోయాయి.   

Advertisment
తాజా కథనాలు