Kumari Aunty: రేవంత్ రెడ్డి ఫొటోకు కుమారి ఆంటీ ప్రత్యేక పూజలు.. దేవుని గదిలో హారతిస్తూ (వీడియో )!

కుమారీ ఆంటీ మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఫుడ్ స్టాల్ తొలగించొదని గతంలో అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పూజలు చేస్తోంది. తన ఇంట్లో దేవుని గదిలో దేవుళ్లతో పాటుగా రేవంత్ రెడ్డికి పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
Kumari aunty worshipping Telangana CM Revanth Reddy photo In Pooja Room

Kumari aunty worshipping Telangana CM Revanth Reddy photo In Pooja Room

కుమారీ ఆంటీ (Kumari Aunty).. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే డైలాగ్ ‘‘మీది తౌజన్ అయింది.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’’. ఈ డైలాగ్‌తో కుమారీ ఆంటీ పేరు మారు మోగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె ఫుల్ ఫేమస్ అయిపోయింది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. కుమారీ ఆంటీ.. కుమారీ ఆంటీ. సమీపంలోని ఉద్యోగస్థులే కాకుండా ఇతర పనుల కోసం వచ్చిన ప్రముఖులు సైతం ఆమె ఫుడ్‌ తినేంత రేంజ్‌లో ఫేమస్ అయిపోయింది. 

సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, యువత మాత్రమే కాకుండా సినీ, రాజకీయ సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్‌కు వెళ్లి భోజనం చేశారు. ఇక ఆమె ఫుడ్ స్టాల్ బిజినెస్ ఎప్పుడైతే బిజీ బిజీగా జరుగుతుందో అప్పుడే కొన్ని చిక్కులు కూడా ఎదురయ్యాయి. ఆమె నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్నారని.. దాని వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులు భావించి.. కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్‌ను తొలగించడానికి సిద్ధమయ్యారు. 

Also Read: భారత్‌ లో టెస్లా..ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!

రేవంత్ రెడ్డి ఆదేశంతో వీరాభిమానిగా

దీంతో కుమారీ ఆంటీ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించి ఆమె ఫుడ్ స్టాల్ తొలగించొద్దని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా తాను కూడా ఫుడ్ స్టాల్ సందర్శిస్తానని చెప్పారు. దీని అనంతరం గతేడాది ఖమ్మం జిల్లాలో భారీ స్థాయిలో వరదలు పోటెత్తాయి. ఆ సమయంల కుమారీ ఆంటీ సీఎం రేవంత్ రెడ్డిన కలిసి తనవంతు సాయంగా రూ.50 వేలను అందించిన విషయం తెలిసిందే. 

Also Read: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే  నో రిఫండ్‌.. ఐటీ శాఖ ఏమందంటే!

రేవంత్ రెడ్డి ఫొటోకు పూజలు

ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఒకే ఒక్క ఆదేశం ఇవ్వడంతో కుమారీ ఆంటీ ఆయన వీరాభిమాని అయిపోయింది. కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్‌ను తొలగించొద్దు అని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో ఆయన్ను దేవునిగా కొలుస్తోంది. కుమారీ ఆంటీ తన ఇంట్లోని దేవుని గదిలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టి పూజలు చేస్తున్న వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. అందులో దేవుళ్ల ఫొటోతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫొటో ఉండటం గమనార్హం. సాయం చేసిన రేవంత్ రెడ్డిని కుమారీ ఆంటీ మర్చిపోలేదని కామెంట్లు చేస్తు్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు