Horoscope Today: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!

వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది.వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే...

New Update
Horoscope Today

Horoscope Today

మేషరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభ సమయం. ఆశించిన ఉద్యోగాన్ని పొందుతారు. స్థానచలనం సూచన ఉంది.

 వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. విశేషమైన ధనలాభం ఉంటుంది. గతంలోని పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే పనులు చేయవద్దు.

Also Read: Anand Mahindra: భారత్‌ లో టెస్లా..ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అవసరాల పట్ల శ్రద్ధ వహించాలి. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులలో విజయం సిద్ధిస్తుంది. కార్యజయం, శత్రుజయం ఉంటాయి. ఆర్ధిక అనుకూలత ఉంటుంది. గృహంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది.

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సన్నిహితులతో అనుబంధం దృఢ పడుతుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారు శుభ వార్తలు అందుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఖర్చులు అధికమయ్యే సూచనలున్నాయి.

వివాదాలకు దిగవద్దు..

కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత చిత్తశుద్ధి అవసరం. సమయపాలన, ఆర్థిక క్రమశిక్షణతో సత్ఫలితాలు సాధించవచ్చు. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది. వ్యాపారంలో సమష్టి నిర్ణయాలతో ప్రయోజనం ఉంటుంది.

Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే  నో రిఫండ్‌.. ఐటీ శాఖ ఏమందంటే!

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు నిధులు సమకూర్చుకుంటారు. రుణభారం తగ్గుతుంది. లాభాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు

వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ మాట తీరు, మీ కోపం నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. కొంచెం అనారోగ్యం, మానసిక ఒత్తిడి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. 
 
ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. సంపద వృద్ధి చెందడం వల్ల సుఖసంతోషాలతో ఉంటారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు.

Also Read:Cancer Vaccine: త్వరలో క్యాన్సర్‌కు టీకా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

మకరరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. సంతానం ఉన్నత స్థానానికి చేరుకోవడం ఆనందం కలిగిస్తుంది.

కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తీవ్రమవుతాయి. ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం భారంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి.

మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. కీలక వ్యవహారాల్లో సంయమనం పాటించండి. అనైతిక పనులకు దూరంగా ఉండండి.

Also Read: Encounter in Bihar: బీహార్‌లో కలకలం.. పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య భీకర కాల్పులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు