Mamata Benarjee: అది నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా.. బీజేపీకి దీదీ సవాల్

బంగ్లాదేశ్‌ ఛాందసవాదులతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని మమతా బెనర్జీ బీజేపీకి సవాల్ చేశారు. ఇటీవల కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనను 'మృత్యు కుంభ్‌' అంటూ వ్యాఖ్యానించారు.

New Update
CM Mamata Benarjee

CM Mamata Benarjee

Mamata Benarjee: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్‌ చీఫ్(Trinamool Congress Chief), సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌(Bangladesh)లో ఉన్న ఛాందసవాదులతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే తన సీఎం పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యేలకు సవాలు చేశారు. బంగ్లాదేశ్‌ ఛాంసవదులతో తాను చేతులు కలిపానని బీజేపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానని ధ్వజమెత్తారు. 

Also Read : నాకు రోజుకో అమ్మాయి.. ఇప్పటికే 400 మందితో చేశా.. కిరణ్‌ రాయల్ సంచలన ఆడియో! 

''బీజేపీ ఎమ్మెల్యేలు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విద్వేషాలు వ్యాప్తి చేసేందుకు, ప్రజలను విడగొట్టేందుకు వాక్‌ స్వాతంత్ర్యం పర్మిషన్ ఇవ్వదు. మతాన్ని బీజేపీ తన రాజకీయాల కోసం వాడుకుంటోంది. జాతీయ భద్రత లేదా విదేశాంగ విధానం అంశాల గురించి నేను మాట్లాడటం లేదు. కానీ.. అమెరికా నుంచి భారతీయ అక్రమ వలసదారులను గొలుసులతో కట్టి బంధించి వెనక్కి పంపడం నిజంగా సిగ్గుచేటు. అమెరికా నుంచి వాళ్లని తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలు పంపించాలని'' అన్నారు.

Also Read: కుంభమేళాకు సాహసయాత్ర.. గంగానదిలో 550km పడవ ప్రయాణం వీడియో వైరల్

'మృత్యు కుంభ్‌'...

మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు కూడా సరైన ప్లాన్ లేదంటూ విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనను 'మృత్యు కుంభ్‌' అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు కుంభమేళాకు వచ్చే వీఐపీలకు మాత్రమే ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నారని, పేదలపై నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ విమర్శలు చేశారు. యూపీలో బీజేపీ సర్కార్.. దేశాన్ని విభజించడం కోసం మతాన్ని అమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా ఇటీవల మౌని అమవాస్య సందర్భంగా మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది భక్తులు మృతి చెందడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 

Also Read: కేంద్రం సంచలన ప్రకటన.. బీపీ, షుగర్, క్యాన్సర్‌ టెస్టులు ఫ్రీ

Also Read: కుంభమేళా నీళ్లలో కోలీఫామ్‌ బ్యాక్టీరియా.. బాంబు పేల్చిన పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్

 

Advertisment
Advertisment