/rtv/media/media_files/2026/01/09/fotojet-9-2026-01-09-15-43-10.jpg)
KTR gave 100 crores to that heroine...Congress leader's sensational allegations
Gajjela Kantham : తెలంగాణ మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(brs-working-president-ktr) పై పీసీపీ నాయకుడు గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన రాయరాని భాషలో కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పించారు. దుబాయ్(dubai) లో తన బినామీని చంపితే ఆధారాలు పోతాయని కేటీఆర్ భ్రమపడ్డారని కానీ, అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని గజ్జెలకాంతం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2022 జనవరి 24న ఒక కాంట్రాక్టర్, జ్యువెలరీ షాప్ యజమాని అకౌంట్ నుంచి ఒక హీరోయిన్‌కు కేటీఆర్ రూ.100 కోట్లు పంపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. అదే ఏడాది మార్చి 3న మైసూర్‌లో షూటింగ్ చేస్తున్న హీరోయిన్‌ను బెదిరించి ఢిల్లీలోని లలిత్ హోటల్ 770వ గదికి.. పిలిపించుకున్నారని, రూ.50 కోట్లు ఇస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : మల్కాజ్‌గిరి ప్రభుత్వ కాలేజీలో దారుణం.. లెక్చరర్ల వేధింపులకు ఇంటర్ విద్యార్థిని బలి
KTR Gave 100 Crores To Heroine
మహారాష్ర్ట రాజధాని ముంబైలో ఉన్న తాజ్ కృష్ణా హోటల్ రూం నెంబర్ 328కు ఒక హీరోయిన్(heroine) ను పిలిపించుకుని రూ.35 కోట్ల 75 లక్షలతో ఒక విల్లా కొనిచ్చారని, అంతేకాక ఆడి కారు కూడా గిఫ్ట్‌గా ఇచ్చారని తీవ్రంగా ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అమెరికాలో రూ.40 వేల కోట్లు, దుబాయ్‌లో రూ.25 వేల కోట్లతో వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిందన్నారు. రాష్ర్టంలో దాదాపు 30 వేల ఎకరాల భూములు దోచుకున్నారని ఆరోపించారు. కేటీఆర్‌కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇవన్నీ అబద్ధాలని తన కొడుకుపై ప్రమాణం చేయాలని అని గజ్జెల కాంతం డిమాండ్ చేశారు.
కేసీఆర్(kcr) కు ఎన్టీఆర్, చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారన్నారు. దొంగ పాస్‌పోర్టులు సృష్టించిన చరిత్ర కేసీఆర్‌దని గజ్జెల కాంతం తీవ్రంగా వివర్శించారు. నాలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ మకాం వేసేవారని, ఆయా రాష్ర్టాల్లో ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల కోసం జగన్‌కు రూ. 200 కోట్లు.. మహారాష్ట్ర, బీహార్, పంజాబ్, ఢిల్లీకి కోట్లాది రూపాయలను కేసీఆర్ పంపించారన్నారు. అఖిలేష్ యాదవ్, కుమారస్వామి కూడా కేటీఆర్ డబ్బులు పంపారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందని, తెలంగాణ ఇచ్చిన సోనియా, రాహుల్‌పై కేటీఆర్(ktr) ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మంచిగుండదని వార్నింగ్ ఇచ్చారు. రాహుల్ గాంధీ కుటుంబం వల్లే కేటీఆర్ మంత్రి అయ్యారని, రాహుల్ కాలి గోటికి కూడా కేటీఆర్ సరిపోరని వ్యాఖ్యానించారు.చట్టాలు, రాజ్యాంగంపై కేటీఆర్‌కు గౌరవం, జ్ఞానం లేదని, చరిత్ర తెలియదని విమర్శించారు. రాహుల్ గాంధీ కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదని.. కేటీఆర్ లాగా రాహుల్, రేవంత్‌లు దేశాన్ని దోచుకోలేదని గజ్జెల కాంతం అన్నారు. మరోసారి రాహుల్ గాంధీని వివర్శిస్తే నాలుకకోస్తా అంటూ గజ్జెలకాంత తీవ్రంగా ఫైర్ అయ్యారు. కాగా గజ్జెలకాంతం ఆరోపణలను పలు యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేయడంతో వైరల్‌గా మారాయి. అదే సమయంలో ఆయన ఉపయోగించిన భాషపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : జిల్లాల పునర్వ్యవస్థీకరణ... తెరపైకి కొత్త జిల్లాల ఉద్యమం? ఎక్కడెక్కడ అంటే?
Follow Us