మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్
TG: సీఎం రేవంత్ రెడ్డికి అండగా టీబీజేపీ నేతలు ఉంటారని అన్నారు కేటీఆర్. వంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారని సెటైర్లు వేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
TG: సీఎం రేవంత్ రెడ్డికి అండగా టీబీజేపీ నేతలు ఉంటారని అన్నారు కేటీఆర్. వంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారని సెటైర్లు వేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
తల్లిని భారంగా భావించిన కొడుకులు ఏకంగా శ్మశానంలో వదిలేశారు. 8 రోజులుగా రాజవ్వ మోతేలోని శ్మశానవాటికలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. సంక్షేమశాఖ అధికారులు రాజవ్వను ఆస్పత్రికి తరలించారు.
TG: కేటీఆర్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై చేసిన భూ దందాల వ్యవహారంపై సీఐడీతో విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. గత పదేళ్లుగా మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ సిరిసిల్ల జిల్లాల్లో భూ దందాలు చేశారని ఆరోపణలు చేశారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులను ఆగం చేసిందన్నారు కేటీఆర్. రూ.15 వేల రైతుభరోసా కోసం రైతులు.. రూ.12 వేల రైతుభరోసా కోసం రైతుకూలీలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. అసలు రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ మంచి మనస్సును చాటారు. రోడ్డు పక్కన చెప్పులు లేకుండా నడుస్తున్న ఓ చిన్నారిని చూసి కారు ఆపారు. ఆ బాలికకు చెప్పులతో పాటు కొత్త బట్టలు కొనిచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జైలుకు పోయిన వారంతా సీఎం అవుతారని కేటీఆర్ భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ లాజిక్ నిజమైతే మొదట జైలుకు వెళ్లిన కవిత సీఎం అవుతారన్నారు. కేటీఆర్ కు ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
TG: మాజీ ఎంపీ గొట్టే భూపతి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య శాంత కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కరీంనగర్లో మృతి చెందారు. గతంలో గొట్టే భూపతి రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థిగా పెద్దపల్లి ఎంపీగా పనిచేశారు.
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటిసులు అందించారు. దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఈ నెల 9న బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. ఈక్రమంలో అనుమతి లేకుండా హైవేపై కౌశిక్‌రెడ్డి ధర్నా చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని నోటీసులిచ్చారు.
తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదన్నారు కేటీఆర్. ఇక్కడ కోటి 60 లక్షల మంది ఆడబిడ్డలకు రూ. 2500 ఇవ్వకుండా...మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామన్న కాంగ్రెస్ నయవంచన హామీని తిరస్కరించారని అన్నారు.