BIG BREAKING: తెలంగాణలో షాకింగ్ కొత్త వైరస్.. సిద్దిపేటలో తొలి కేసు!

మహారాష్ట్రలో విజృంభిస్తున్న గిలియన్‌ బార్‌ సిండ్రోమ్‌ తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ మహిళలో ఈ సిండ్రోమ్‌ లక్షణాలు బయటపడ్డాయి. మహిళ హైదరాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

New Update
gbs

gbs

మహారాష్ట్రలో విజృంభిస్తున్న గిలియన్‌ బార్‌ సిండ్రోమ్‌ తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ మహిళలో ఈ సిండ్రోమ్‌ లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా రోగనిరోధక కలిగి ఉన్నవ్యక్తులు ఈ  జీబీఎస్‌ బారిన పడే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు.అయితే ఇది అంటు వ్యాధి కాదని , నయం చేయోచ్చని వైద్యులు చెబుతున్నారు.

Also Read: Delhi: హత్య కేసు నిందితుడ్ని పట్టించిన బూందీ లడ్డూ!

మహారాష్ట్ర ప్రజల్లో గులియన్ బారే సిండ్రోమ్ గుబులు రేపుతుంది. అరుదైన న్యారోలాజికల్ డిజార్డర్ అయిన జీబీఎస్.. పుణేలో ఎక్కువ మందికి సోకుతున్నట్లు వైద్యులు ప్రకటించారు.  ఇప్పటి వరకు వందల సంఖ్యలో దీని బాధితులు ఉండగా.. 50 మందిని వెంటిలేటర్‌పై ఉంచినట్లు సమాచారం. అంతేకాక గతవారంలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.

Also Read: NO Insurence: ఇన్సూరెన్స్‌ లేదా..అయితే నో పెట్రోల్‌,నో డీజిల్‌!

వైద్యారోగ్య శాఖ మాత్రం పుణే జిల్లా వ్యాప్తంగా ఇంటింటా సర్వేలు మొదలు పెట్టింది. గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడ్డారని తెలిస్తే వెంటనే వారిని ఆస్పత్రులకు తీసుకుని పోతున్నారు. అలాగే ఈ వ్యాధి ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, చికిత్స ఎలా తీసుకోవాలో కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. 

పుణేలో గులియన్ బారే సిండ్రోమ్ బాధితుల సంఖ్య రోజురోజుకి  పెరుగుతండగా.. ఆసుపత్రుల  వైద్య బృందాలన్నీ అప్రమత్తం అయ్యాయి. ఈక్రమంలోనే వైద్యోరోగ్య శాఖకు ఈ విషయాలను వివరించి జిల్లా వ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈక్రమంలోనే వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వేలు చేస్తూ.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. 

ఇప్పటి వరకు మొత్తంగా 7 వేల 200 ఇళ్లలో ఈ సర్వేలు చేపట్టారు. అలాగే ఈ వ్యాధి సోకిన వారికి ఇచ్చే ఇంజక్షన్లు, మందుల నిల్వలను అన్ని ఆస్పత్రుల్లోనూ అంతకంతకూ ఎక్కువ మోతాదులో ఉంచుతున్నారు.

అసలి  గులియన్ బారే సిండ్రోమ్ అంటే...


గులియన్ బారే సిండ్రోమ్ అనేది అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. ఇది శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. ఈ వ్యాధి సోకిన వారందరిలోనూ నరాల బలహీనత, తిమ్మిర్లు, పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతాయి. అయితే ఈ వ్యాధి సోకిన వాళ్లు ఎక్కువ మంది త్వరగానే కోలుకుంటున్నారు.

దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

ముందుగా కండరాల నొప్పి మొదలవుతుంది. నడవడానికి, పనులు చేసుకోవడానికి కూడా కష్టం అవుతుంది. అలాగే శ్యావ తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. మాట్లాడడం, మింగడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాగే దృష్టి సమస్యలను కూడా ఎదుర్కుంటారు. జీబీఎస్ లక్షణలు రోజులు లేదా కొన్ని వారాల పాటు అభివృద్ధి చెందుతాయి. లక్షణాలు కనిపించిన మొదటి రెండు వారాల్లోనే చాలా మంది బలహీనతతో అత్యంత తీవ్రమైన దశకు చేరుకుంటారు. మూడో వారం నాటికి మరింత బలహీనపడుతుంటారు.

Also Read: USA: అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు

Also Read:Supreme Court : పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాకు పారిపోయాడు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు