Aghori: పోలీస్ ఐతే ఏంటి.? బట్టలిప్పి అఘోరి హల్‌చల్

పెద్దపల్లి జిల్లా రామగుండంలో అఘోరి హల్‌చల్ చేసింది. ఓ భక్తురాలి ఇంట్లో పూజలు చేసేందుగా రాగా.. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు అఘోరిని పీఎస్ కి తరలించగా స్టేషన్ లో బట్టలిప్పి హంగామా చేసింది.

New Update

Aghori: అఘోరీ మరోసారి కరీంనగర్ లో హల్ చల్ చేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఓ భక్తురాలి ఇంటికి పూజలు చేసేందుకు వెళ్లగా .. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి భారీగా చేరుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అఘోరీని పంపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అఘోరీ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పోలీసులపై బూతు పురాణం మొదలు పెట్టింది. దీంతో అఘోరినీ పీఎస్ కు  తరలించగా .. పీఎస్ ముందు బట్టలిప్పి నానా హంగామా చేసింది. 

Also Read:Daaku Maharaaj: దబిడి దిబిడే.. ఓటీటీలోకి బాలయ్య డాకు మహారాజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇది ఇలా ఉంటే.. ఇటీవలే  కరీంనగర్ బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా తనపై దాడి జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. లక్సెట్‌పేటలో భక్తురాలి ఇంటికి భిక్షాటనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.

Also Read:Vijay Sethupathi: తమిళంలో పాన్‌ కార్డు మార్చాలి.. స్టార్‌ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?

మసీదును కూల్చేస్తా 

ఆ మధ్య  కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన అఘోరీ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడడంలో  తన ప్రాణాలుప్రాణాలు కూడా  లెక్క చేయనని తెలిపింది. కరీంనగర్ దేవాలయంలోని  మసీదును తానే స్వయంగా కూల్చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంపై తన గురువులతో మాట్లాడినట్టు తెలిపింది.
కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని కాపాడటంలో  ముందుంటానని తెలిపింది.  ఆడపిల్లలకు అన్యాయం జరిగితే సహించనని తేల్చి చెప్పింది.

పలువురి పై కత్తితో దాడి 

మంగళవారం మధ్యాహ్నం అఘోరి కొమురవెల్లి మల్లికార్జున ఆలయంలోకి నగ్నంగా వెళ్లి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ బట్టలేసుకుని లోపలికి వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో తీవ్ర ఆగ్రహనికి గురైన అఘోరి  అక్కడున్న పలువురి పై కత్తితో దాడి చేసింది

Advertisment
తాజా కథనాలు