/rtv/media/media_files/2025/02/03/LusxE22fJ9i12JZzwVnY.jpg)
Women Fight on TS RTC Bus
Women Fight on TG RTC Bus: పంతానికి దిగితే మహిళలు ఎంతకైనా తెగిస్తారు అనే దానికి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోనే నిదర్శనం. బస్సులో సీటు కోసం ఏకంగా నడిరోడ్డుపైనే జుట్లు పట్టుకుని మహిళలు బాదుకున్నారు. ఎవరు ఆపినా.. ఆగకుండా జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. అయితే ఇదంతా ఎక్కడో కాదు.. తెలంగాణలోనే జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్(Viral Video)గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) ఫ్రీ బస్సుల(Free Bus) పథకాన్ని మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఎలాంటి టికెట్ లేకుండా జర్నీ చేసేందుకు మహిళలకు అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ పథకం అమలు జరిగినప్పటి నుంచి బస్సులో ఏదో ఒక లొల్లి జరుగుతూనే ఉంది.
Also Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం
సీట్ల కోసం జుట్లు పట్టుకుని
సీట్ల కోసం మహిళలు ఘోరాతి ఘోరంగా దాడులు చేసుకుంటున్నారు. ఆపుదామని అడ్డుచ్చిన వారిని సైతం పక్కకు నెట్టి జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు చాలానే అలాంటి ఇన్సిడెంట్లు జరిగాయి. సీటు కోసం బస్సులోనే బాదుకున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలో బస్సు సీట్ కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2025
మంథని నియోజకవర్గం కాళేశ్వరం దేవస్థానం బస్టాండ్‌లో బస్సులు లేక, వచ్చిన ఒక్క బస్సులో సీట్ కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు pic.twitter.com/R3EraZA56E
Also Read: పార్లమెంట్ ను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట
మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) నియోజకవర్గంలో బస్సు సీట్ కోసం మహిళలు జుట్లు పట్టుకొని తుక్కుతుక్కుగా బాదుకున్నారు. మంథని నియోజకవర్గం కాళేశ్వరం దేవస్థానం బస్టాండ్‌లో బస్సులు లేక ఇబ్బంది పడ్డారు. అనంతరం వచ్చిన ఒక్క బస్సులో సీట్ కోసం ఆ మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. వారిని విడిపించేందుకు మగవారు సతవిధాలా ప్రయత్నించి చివరికి విడిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.