కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తప్ప ఎవరూ ఇవ్వలేదు : మంత్రి పొన్నం

కులగణనపై చర్చ జరిగేటప్పుడైనా KCR అసెంబ్లీకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వే కోసం ఇంటికెళ్తే కొందరు వివరాలు ఇవ్వలేదన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తప్పా ఎవరూ కులగణనలో లెక్కలు చెప్పాలేదని ఆయన చెప్పారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడారు.

author-image
By K Mohan
New Update
Ponnam Prabhakar: మీకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదు.. బీజేపీ ఎంపీలపై పొన్నం ఫైర్!

తెలంగాణలో జరిగిన కులగణన సర్వేపై సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్‌లో మాట్లాడారు. ప్రధాన రాజకీయ పార్టీ పెద్దలు కులగణనలో వివరాలు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. సర్వే కోసం వెళ్లిన వాళ్లపైకి కుక్కలని వదిలారు, సహాయ నిరాకరణ లాగా కొందరు కావాలని వివరాలు ఇవ్వని వారు ఇన్నారని చెప్పారు. కుల గణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో చెప్పాలని మంత్రి పొన్నం కోరారు.

Also Read :  అలర్ట్.. హైదరాబాద్‌లో ఫేక్ SIM కార్డ్స్ కలకలం

బలహీన వర్గాల కోసం రేపు ప్రత్యేక అసెంబ్లీలో తమ వాదన వినిపించాలని అన్ని పార్టీలకు సూచించారు. కల్వకుంట్ల కుటుంబంలో ఒక్క కవిత తప్పా.. ఎవరూ కుల గణనలో వివరాలు ఇవ్వలేదని మంత్రి అన్నారు. మేం కమిటీ రిపోర్టును బీరువాలో, ఫ్రిడ్జ్‌లో పెట్టమని మాట ఇచ్చాం.. కుల గణన చేసి చూపించామని ఆయన అన్నారు. 

Also Read:Health Tips: ఖాళీ కడుపుతో నెల రోజుల పాటు ఈ డ్రై ఫ్రూట్ వాటర్‌ తాగితే శరీరం ఉక్కులా మారుతుంది అంతే!

కులగణన ఒక ఉద్యమం లాగా చేశాం. రాష్ట్రంలో ఎవరు ఎంత అనే లెక్క తేలింది. క్యాబినెట్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కుల గణన అడ్డుకోవాలని చూస్తే సహించేదేలేదని పొన్నం చెప్పారు. కుల గణన కోసం పోరాటం చేసిన వారందరికీ హ్యాట్సాఫ్, నిర్ణయం నుండి నివేదిక దాకా కులగణన ప్రక్రియలో ఉన్నందుకు గర్వంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణన చర్చ జరిగేటప్పుుడైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరారు. బీసీలకు న్యాయం జరగాలని కేసీఆర్‌కు తపన ఉంటే.. రేపు అసెంబ్లీకి వస్తారని ఆయన అన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు