/rtv/media/media_files/2025/01/31/WytSIJxrIqyz0aN8P4rM.jpg)
Telangana RTC Bus Accident
తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగ్ లో ఆర్టీసీ బస్సు టైర్ పగిలిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురి ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాదం గమనించి స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను కష్టం మీద బయటకు తీసుకువచ్చారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్ న్యూస్:
— Telangana Awaaz (@telanganaawaaz) January 31, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివారులో టైర్ పగలడంతో పొలంలోకి దూసుకు వెళ్లిన ఆర్టీసీ బస్సు..
పలువురికి తీవ్ర గాయాలు..@Collector_RSL pic.twitter.com/tqbspo3Hud