MLC Kavita: నేను జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నప్పుడు కాంగ్రెస్ ఎక్కడికి పోయింది!!
60 ఏళ్ల తమ పాలనలో అసెంబ్లీలో , పార్లమెంట్ లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని ఎమ్మెల్సీ కవిత కౌంటర్ వేశారు. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇంకా గాంధీ భవన్ గాడ్సే రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదన్నారు కవిత..