డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. | Prabhas On Say No To Drugs | CM Revanth Reddy | RTV
డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. | Tollywood Actor Prabhash gives message on the consumption of Drugs and talks On "Say No To Drugs" | CM Revanth Reddy | RTV"
డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. | Tollywood Actor Prabhash gives message on the consumption of Drugs and talks On "Say No To Drugs" | CM Revanth Reddy | RTV"
హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అంగూర్ బాయ్‌ను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. దూల్పేట్కే గంజాయి డాన్‌గా పేరు తెచ్చుకున్న ఈమె గతంలో ఓసారి జైలుకు వెళ్లి వచ్చింది. పదికి పైగా కేసులు ఉన్నా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది.
రాజ్‌తరుణ్, లావణ్య వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్ సాయిని గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 24న విజయవాడలో డ్రగ్స్ దొరకగా.. ఈ కేసులో మస్తాన్ ను పోలీసులు A4గా చేర్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ కేసుల్లో ఎంతటి ప్రముఖులున్నా, స్టార్ సినీ సెలబ్రిటీలున్నా ఎవరినీ ఉపేక్షించొద్దని నార్కొటిక్స్ విభాగం అధికారులకు సూచించారు సీఎం రేవంత్. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఆదేశించారు.
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రముఖ సినీ దర్శకులు క్రిష్ విచాణకు హాజరయ్యారు. గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం క్రిష్ ను విచారించారు. ఆయన నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ గలీజ్ దందాలో పది మంది వీఐపీల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు వ్యాపారవేత్తలు, గజ్జెల వివేకానంద్ అబ్బాస్, కేదార్ తో పాటు సందీప్, ఇద్దరు అమ్మాయిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
నవదీప్ డ్రగ్స్ కేసులో హైకోర్టు ఇద్దరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవెంట్ ఆర్గనైజర్ కలహర్ రెడ్డి, స్నార్ట్ పబ్ యాజమాని సూర్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. వీరిద్దరు తిరిగి ఈ నెల 26న గుడిమల్కాపూర్ పోలీసుల ముందు హాజరుకావాలని హై కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలంది.
నవదీప్ కు నార్కోటిక్ పోలీసులు నోటీసులను జారీ చేశారు. ఈనెల 23 వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేశారు. 41 A కింద నార్కోటిక్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
భాగ్యనగర్‌లో డ్రగ్స్ మరోసారి కలకలం రేపింది. పోలీస్ అధికారి ఇంట్లోనే డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు గుర్తించారు. దీంతో ఎస్సైని అరెస్టు చేశారు పోలీసులు. గతంలో ఓ కేసులో బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.