/rtv/media/media_files/2025/12/05/fotojet-2025-12-05t094915756-2025-12-05-09-49-39.jpg)
BL Santosh's warning to Telangana BJP leaders
Telangana BJP Leaders : తెలంగాణ బీజేపీ నేత(telangana-bjp-leaders)లకు హైకమాండ్ కీలక నేత బీఎల్ సంతోష్(bl-santhosh) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఉంటే ఉండండి.. పోతే పొండి.. మీరు పోతే పార్టీకి కమిట్‌మెంట్‌తో పనిచేసే నాయకులొస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ వర్క్‌షాప్‌నకు ముఖ్య అతిథిగా హాజరైన బీఎల్ సంతోష్ పలువురు నేతలతో ప్రత్యేకంగా సమావేశమై క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో పార్టీలోని అంతర్గత వ్యవహారాలపై ఓపెన్‌గా మాట్లాడుతున్న ఈటల రాజేందర్(eetala-rajendar), ధర్మపురి అర్వింద్‌లను ఉద్దేశించే బీఎల్ పరోక్షంగా ఈ హెచ్చరికలు చేశారని చర్చ జరుగుతోంది. పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తూ నెగెటివ్ మాటలు మాట్లాడే నేతలు పార్టీ వీడి వెళ్లిపోవచ్చని బీఎల్ కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. పార్టీ డోర్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, వెళ్లే వాళ్లు వెళ్తారు వచ్చే వాళ్లు వస్తారని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని హార్డ్‌వర్క్ చేసేవాళ్లు మాత్రమే పార్టీలో కీలక పదవులొస్తాయని తేల్చి చెప్పారు. ఇందుకు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను బీఎల్ ఉదాహరణగా పేర్కొన్నారు. బీఎల్ సంతోష్ మాట్లాడిన మాటలు పార్టీలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి.
Also Read : శంషాబాద్ విమానశ్రయంలో అయ్యప్ప స్వాముల ఆందోళన..
బండిని టార్గెట్ చేస్తున్న ఈటల..
కాగా, గతంలో సొంత పార్టీకే చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని ఉద్దేశించి ఈటల వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరిగింది. ‘బీ కేర్‌ఫుల్.. కొడకా.. బీ కేర్‌ఫుల్’ అంటూ హెచ్చరిక జారీ చేశారు. ‘‘వాడు సైకోనా.. శాడిస్టా? మనిషా.. పశువా? ఏ పార్టీలో ఉన్నడు? ఎవని అండతో ధైర్యం చేస్తున్నడు? మేం శత్రువుతో కొట్లాడుతం. కానీ, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే సంస్కృతి మా రక్తంలో లేదు. నీ శక్తి ఏంది? యుక్తి ఏంది? నీ చరిత్ర ఏంది? మా చరిత్ర ఏందిరా?’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ఏమేం పెడుతున్నారో అన్నీ పైకి పంపిస్తానన్నారు. ఇలాంటి వాటిని అరికట్టకపోతే తనకేమీ నష్టం లేదని వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంటుకు సంబంధించి ఈటల రాజేందర్‌కు, బండి సంజయ్‌కి మధ్య అంతర్గతంగా విభేదాలు ఉన్న నేపథ్యంలో శనివారం పలువురు హుజూరాబాద్ నాయకులు, కార్యకర్తలు గతంలో శామీర్‌పేటలోని ఈటల నివాసానికి వచ్చారు. ఈటలతోపాటు బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన తమకు స్థానికంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారు ఈటలకు తెలిపారు. జిల్లాలో ఇతర బీజేపీ నాయకులు.. ఈటల వర్గాన్ని పార్టీకి దూరం చేయాలని చూస్తున్నారని మొర పెట్టుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఈటల.. పరోక్షంగా సంజయ్‌పై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.
Also Read : ఆదిలాబాద్‌కు త్వరలో ఎయిర్‌పోర్టు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
కిషన్‌రెడ్డి, రాంచంద్రరావుపై అర్వింద్ సెటైర్లు..
ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారానికి తాను రానని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్(bjp-mp-arvind-kumar) ఇటీవలే వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు. తాను జూబ్లీహిల్స్ ప్రచారానికి రాకపోయినా, సోషల్ మీడియాలో అంతకన్నా ఎక్కువ ప్రచారం చేస్తున్నానని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ప్రచారానికి రాలేదని అధిష్టానానికి ఫిర్యాదు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తన సోషల్ మీడియా బలంతో చేసే ప్రచారం వారు చేస్తున్నదానికంటే ఎక్కువగానే ఉందని కిషన్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ‘ మేము గ్రామస్తులం. గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం. జూబ్లీహిల్స్ ప్రచారానికి రావట్లలేదని నాపై ఫిర్యాదు చేయకండి రామచంద్రరావు గారు. నేను సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం.. మీరు ఫిజికల్‌గా చేస్తున్నదానికంటే ఎక్కువగానే ఉంది. నా సోషల్ మీడియా బలంతో నేను ఎన్నికల ప్రచారం చేస్తున్నా. జూబ్లీహిల్స్‌కు రావట్లేదని నాపై అధిష్టానానికి ఫిర్యాదు చేయకండి, అక్కడ మా నాయకులున్నరు. మా సీనియర్ నేతలు ఉన్నారు. మా ఎంపీలు ఉన్నారు. మా మంత్రులు కూడా ఉన్నారు. ఆ ప్రచారాన్ని వారు చూసుకుంటారు’ అని ధర్మపురి అర్వింద్ సెటైర్లు వేయడం వివాదాస్పదమైంది. దీనిపై హైకమాండ్ సీరియస్ అయి అర్వింద్‌ను ఢిల్లీకి పిలిచి ప్రత్యేకంగా వివరణ కోరినట్టు కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా బీఎల్ సంతోష్ ఈటల, అర్వింద్‌లకే వార్నింగ్ ఇచ్చారని పార్టీలో చర్చ జరుగుతోంది.
Follow Us