/rtv/media/media_files/2025/12/05/fotojet-2025-12-05t075811475-2025-12-05-07-58-44.jpg)
Ayyappa Swami's agitation at Shamshabad airport.
Shamshabad airport : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శంషాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటలు ఆలస్యం కావడంతో వారు ఆందోళనకు దిగారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్వాకంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అయ్యప్ప స్వాములు పడిగాపులు పడ్డారు. విమానం ఆలస్యం కావడం.. ఆ సమాచారాన్ని ప్రయాణికులకు చేరవేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించడంపై నిరసనకు దిగారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానం ఇప్పటికీ బయలు దేరకపోవడంతో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. బోర్డింగ్ గేటుకు అడ్డంగా నిలబడిఆందోళనకు దిగిన ఆయ్యప్ప భక్తులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా బుధవారం, గురువారం కూడా శంషాబాద్ నుంచి కేరళకు వెళ్లే విమానం అకస్మాత్తుగా రద్దు కావడంతో శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఎలా విమానం రద్దు చేస్తారు?” అంటూ భక్తులు విమానాశ్రయ అధికారులను ప్రశ్నించారు. విమాన రద్దుకు ప్రత్యామ్నాయంగా వెంటనే మరో సర్వీస్‌ను ఏర్పాటు చేయాలని లేదా ప్రత్యేక విమానాన్ని నడపాలని భక్తులు డిమాండ్ చేశారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ అసౌకర్యం పెరగడంతో విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది.
ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్వాకంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గత మూడు రోజులుగా అయ్యప్ప స్వాములు పడిగాపులు కాస్తున్నారు. విమానం ఆలస్యం కావడం.. ఆ సమాచారాన్ని ప్రయాణికులకు చేరవేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో అయప్ప భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం.. బుధవారం ఉదయం 9.40గం. విమానం రావాల్సి ఉన్న విమానం ఎంతకీ రాకపోవడంతో పడిగాపులు పడ్డారు. ఈలోపు ఆలస్యానికి కారణాలను కూడా వివరించలేదు. దీంతో స్వాములు ఆందోళనకు దిగడంతో.. సిబ్బంది సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Follow Us