సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆయన గురువారం ఆదిలాబాద్‌లో పర్యటించారు. ఈ క్రమంలోనే రూ.18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. '' ప్రజాప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్నాం. ఈ రెండేళ్లు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నాను.
వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రాజకీయ భేదం లేకుండా పనిచేస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో పదేళ్లుగా విపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వ కార్యక్రమాలకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎమ్మెల్యేలను సైతం సెక్రటేరియట్‌కు రాకుండా అడ్డుకున్నారు. సోనియాగాంధీ ఏ ఆశయంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో.. గత ప్రభుత్వ పాలనలో అది నెరవేరలేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంటరీని రూపొందించాం.
Also Read: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్‌షాక్..కొడుకు కంపెనీపై కేసు
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో డిసెంబర్ 8,9న గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నాం. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇంద్రవెల్లి స్పూర్తితోనే గత ప్రభుత్వ పాలనపై పోరాటం మొదలుపెట్టాను. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంద్రవెల్లి అమరుల స్థూపాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ఫైల్‌పై సంతకం చేశాను. గతంలో వైఎస్‌ఆర్.. ఆదిలాబాద్‌కు సాగునీరు అందించేందుకు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ కేసీఆర్ మాత్రం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాంచారు. కానీ 3 ఏళ్లకే అది కూలింది.
Also Read: అమ్మో.. పుతిన్ ప్రయాణించే విమానానికి ఇంత సెక్యూరిటీ ఉంటుందా ! తెలిస్తే షాక్ అయిపోతారు
ప్రజల డబ్బులు దోచుకుని ఇంకా అక్రమ సొమ్ము కోసం ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్దే నిర్మిస్తాం. ఆదిలాబాద్‌కు నీరు అందిస్తాం. ఎన్నికలు పూర్తి అయ్యాక మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని'' సీఎం రేవంత్ అన్నారు.
Telangana: ఆదిలాబాద్‌కు త్వరలో ఎయిర్‌పోర్టు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆయన గురువారం ఆదిలాబాద్‌లో పర్యటించారు.
CM Revanth