Rashmika Mandanna : నా కోసం యుద్ధం చేస్తే...నేను తూటాకైనా ఎదురెళ్తా...రష్మిక ఆసక్తికర కామెంట్స్‌

తన కోసం యుద్ధం చేసే జీవిత భాగస్వామి కావాలని నటి రష్మిక మందన్న తాజాగా ఓ చిట్‌చాట్‌లో తెలిపారు. తనకోసం యుద్ధం చేస్తే తనకోసం ఎంతదూరమైన వెళ్తానని అవసరమైతే తూటాకైనా ఎదురెళ్తా అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

New Update
FotoJet - 2025-11-08T112102.793

If you fight for me...I will face a bullet...Rashmika's interesting comments

Rashmika Mandanna : తన కోసం యుద్ధం చేసే జీవిత భాగస్వామి కావాలని నటి రష్మిక మందన్న తాజాగా ఓ చిట్‌చాట్‌లో తెలిపారు. తనకోసం యుద్ధం చేస్తే తనకోసం ఎంతదూరమైన వెళ్తానని అవసరమైతే తూటాకైనా ఎదురెళ్తా అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

త్వరలో విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) తో  ఏడడుగులు వేయబోతున్నట్లు గత కొద్ది కాలంగా పుకార్లు(Love Affair) షికారు చేస్తున్న వేళ ఒక యూట్యూబ్‌ ఛానల్‌లో ఆమె చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.ఇటీవల పలువురు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారట కదా ప్రశ్నిస్తే .. ‘నా ఎంగేజ్‌మెంట్‌ విషయంలో మీరు ఏం అనుకుంటున్నారో అదే నిజం. సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తా’  అని అందరినీ అయోమయంలోకి నెట్టేస్తోంది రష్మిక. తాజా చిట్ చాట్‌లో  తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో వెల్లడించింది.

Also Read :  ఈ ఒక్క ఫొటో చాలు బాబోయ్!... రాజ్‌కు సమంత హగ్‌.. త్వరలోనే పెళ్లి!

Rashmika's Interesting Comments

మీ  భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారో చెప్పాలని ఒక అభిమాని కోరగా రష్మిక(Rasmika Mandana) నవ్వుతూ దానికి ఇచ్చిన సమాధానం అందర్నీ ఆకట్టుకుంది. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా తన కోసం నిలబడే జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు ఆమె వివరించారు.

‘‘నిజాయితీగా చెప్పాలంటే నన్ను లోతుగా అర్థం చేసుకునే వ్యక్తి. ప్రతి విషయాన్ని నావైపు నుంచి ఆలోచిస్తూ అర్థం చేసుకోవాలి. అన్ని పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తి.. ఎలాంటి దాన్నైనా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని నేను కోరుకుంటున్నాను అన్నారు.  అంతేకాక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, నాకోసం యుద్ధం చేయగల వ్యక్తి కావాలి. అలాంటి భాగస్వామి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. యుద్ధంలో తూటాకైనా ఎదురెళ్తా’’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న త్వరలో  విజయ్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. కొన్నేళ్లుగా విజయ్‌తో ప్రేమలో ఉండగా.. వచ్చే ఏడాది వీరు పెళ్లి బంధంతో ఒక్కటికాబోతున్నారట.

ఇది కూడా చూడండి: Maoist Partys Ceasefire: కాల్పుల విరమణ ఊహించని పరిణామం..మావోయిస్టు పార్టీ సంచలన లేఖ 

Advertisment
తాజా కథనాలు