/rtv/media/media_files/2025/11/08/samantha-2025-11-08-06-50-21.jpg)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత(Samantha), డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్లుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. పలు వేదికల్లో ఇద్దరూ కలిసి కనిపించారు. ఈ ఏడాది దీపావళి సెలబ్రేషన్స్ కూడా డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఫ్యామిలీతో కలిసి జరుపుకుంది సమంత. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లోనే ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోవడం పక్కా అంటూ కథనాలు బయటకు వచ్చాయి. ఆ కథనాలను నిజం చేస్తూ సమంత షేర్ చేసిన ఓ పిక్ ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. ఆమె రాజ్‌తో క్లోజ్‌గా కనిపించడమే అందుకు కారణమని చెప్పాలి. తన కొత్త పెర్ఫ్యూమ్ బ్రాండ్ "సీక్రెట్ ఆల్కెమిస్ట్" ప్రారంభోత్సవం సందర్భంగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఇందులో రాజ్ ను సామ్ చాలా క్లోజ్ గా హగ్ చేసుకుంది. ఈ ఫోటో, వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.
Samantha with Family man Director Raj Nidimoru. #SamanthaRuthPrabhu#RajNidimorupic.twitter.com/8pfY7S26D7
— Warrior YSRCP (@Vamsee007) November 8, 2025
Also Read : ‘రేసుగుర్రం నటుడిని చంపేస్తాం’.. గ్యాంగ్‌స్టర్ మాస్ వార్నింగ్..!
సమంత ఎమోషనల్ నోట్
ఈ ఫోటోలతో పాటుగా పలువురితో దిగిన ఫోటోలను కూడా సామ్ పంచుకుంటూ సమంత ఒక ఎమోషనల్ నోట్‌ను రాసింది. "స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నాను. గత ఏడాదిన్నర కాలంలో, నేను నా కెరీర్‌లో కొన్ని అత్యంత సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్‌లు తీసుకోవడం, నా అంతర్ దృష్టిని విశ్వసించడం, ప్రయాణిస్తూనే నేర్చుకోవడం వంటివి చేశాను. ఈ రోజు, నేను ఈ చిన్న విజయాలను జరుపుకుంటున్నాను," అని ఆమె పేర్కొన్నారు. పని విషయంలో తాను కలిసిన వ్యక్తుల గురించి ప్రస్తావిస్తూ, "నేను కలిసిన అత్యంత తెలివైన, కష్టపడి పనిచేసే మరియు నిజాయితీగల వ్యక్తులతో పనిచేస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని నాకు చాలా నమ్మకం ఉంది," అని సమంత రాశారు.
'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో సమంత, రాజ్ కలిసి పనిచేశారు. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో 'రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్‌డమ్' అనే మరో సిరీస్ రానుంది. వీరిద్దరూ వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తరచుగా కలిసి కనిపించడంతో, వారి రిలేషన్‌గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, వీరిద్దరూ తమ సంబంధంపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఇక సమంత త్రాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించవచ్చని సమాచారం.
Also Read : మోహన్‌లాల్ 'వృశ్భ' మూవీ ఫస్ట్ లుక్ అదుర్స్.. రిలీజ్ ఎప్పుడంటే..?
Follow Us